News

వాడరేవులో సామూహిక సాగర హారతి

302views

ఏప్రిల్ 12న బాపట్ల జిల్లా, చీరాలమండలం, వాడరేవు (సముద్ర తీర ప్రాంతం) గ్రామంలో పౌర్ణమి సందర్భంగా హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో డాక్టర్ తాడివలస దేవరాజు పర్యవేక్షణలో సామూహిక సాగర హారతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమమునకు ప్రధాన వక్తగా హిందూ చైతన్య వేదిక బాపట్ల జిల్లా సహ సంయోజక్ బండారు జ్వాలా నరసింహ పాల్గొని ప్రసంగిస్తూ హైందవ సనాతన ధర్మం, ప్రాచీనసంస్కృతి, సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు వాటి ఆనవాళ్లు ప్రారంభంలో ఎలాఉన్నవో ఇప్పటికీ అలాగేఉన్నవి. భారతదేశ వ్యాప్తంగా విలసిల్లుతున్న హిందూ నాగరికత, హిందూ జీవన విధానము లక్షల సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ చెక్కుచెదరలేదనేది వాస్తవం అని అన్నారు. ఈ కార్యక్రమంలో వాడరేవు గ్రామ ధార్మిక జట్టు సంయోజక్ పవన్ కుమార్ తోపాటు అనేకమంది కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.