News

అక్రమ దర్గా కూల్చేయడంతో నాసిక్ లో ఘర్షణలు

614views

మహారాష్ట్రలోని నాసిక్ లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ద్వారక ప్రాంతంలోని కథేగల్లి లో అక్రమంగా నిర్మించిన దర్గాను అధికారులు కూల్చేసేందుకు మున్సిపల్ అధికారులు ప్రయత్నించారు. దీంతో హింస చెలరేగింది. ఈ హింస చెలరేగిన సమయంలోనే విద్యుత్ సరఫరాకి అంతరాయం ఏర్పడింది. ఈ సమయంలోనే ఇస్లామిక్ నిరసనకారుల నుంచి రాళ్లు రువ్వడం ప్రారంభమైంది. ఈ రాళ్ల దాడిలో నలుగురు పౌరులు, 31 మంది పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. ఇదే హింసలో ఐదు వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి.

కథేగల్లిలో నిర్మిస్తున్న దర్గా అనధికారికంగా నిర్మిస్తున్నారని నాసిక్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ప్రకటించారు. దర్గాఅనధికారమని, 15 రోజుల్లోపు కూల్చేయాలని ఆదేశించారు. అయినా.. నిర్వాహకులు స్పందించకపోవడంతో.. మున్సిపల్ అధికారులు పోలీసు భద్రతో దిగారు. కూల్చివేతకు దిగారు.

దర్గా ట్రస్టీలు, స్థానికులు నిర్మాణాన్ని తొలగించడానికి అంగీకరించారు. దీని ప్రకారం అందరూ రాత్రి 11 గంటల ప్రాంతంలో గుమిగూడారు. ఇదే సమయంలో ఉస్మానియా చౌక్ నుంచి ఓ గుంపు వచ్చింది.గందరగోళం చెలరేగింది. వీరిని ఆపడానికి స్థానికులు ప్రయత్నించారు. అధికారులు కూడా ప్రయత్నించారు .అయినా ఆందోళనాకారులు ఆగలేదు. రాళ్లు రువ్వడం ప్రారంభించారు.

అర్ధరాత్రి దాటిన తర్వాత, తప్పుడు సమాచారం వ్యాప్తి చెందడంతోనే అసలు గొడవలు మొదలయ్యాయని పోలీసులు పేర్కొన్నారు. 500 మంది పోలీసులను మోహరించినా… నిరసనకారులు ఆగలేదు.చివరికి పోలీసులు శాంతింపజేశారు.