News

బెంగాల్ దారిలో కర్ణాటక.. వక్ఫ్ చట్టంపై కాంగ్రెస్ ప్రభుత్వం..

344views

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వక్ఫ్ సవరణ చట్టంపై పలు రాష్ట్రాల్లో ముస్లింలు ఆందోళన చేస్తున్నారు. బెంగాల్‌లో ఏకంగా ఈ నిరసనలు హింసాత్మకంగా మారాయి. ముగ్గురు చనిపోయారు. మరోవైపు, తమ రాష్ట్రంలో వక్ఫ్ చట్టాన్ని అమలు చేసేది లేదని సీఎం మమతా బెనర్జీ స్పష్టం చేశారు.

ఇదిలా ఉంటే, బెంగాల్ దారిలో కర్ణాటక ప్రభుత్వం కూడా నడుస్తోంది. కాంగ్రెస్ నేత, కర్ణాటక మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ మాట్లాడుతూ.. కర్ణాటక ప్రభుత్వం ఈ చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేయదని చెప్పారు. ‘‘మమతా బెనర్జీ, తమిళనాడు ముఖ్యమంత్రి, కేరళ ప్రభుత్వం, కర్ణాటక ప్రభుత్వం వక్ఫ్ సవరణ చట్టం తమకు ఆమోదయోగ్యం కాదని నిర్ణయం తీసుకున్నాయి. ఈ బిల్లు ఆమోదం పొందకూడదు కానీ, ఆమోదం పొందింది. మాకు కోర్టులో న్యాయం జరుగుతుందని ఖచ్చితంగా అనుకుంటున్నాము. కర్ణాటకలో దీనిని అమలు చేయము’’ అని అన్నారు.