News

పాడేరులో మావోయిస్టు మిలిసియా సభ్యులు లొంగుబాటు….

300views

అల్లూరి సీతారామరాజు జిల్లా గాలికొండ ఏరియా కమిటీ మావోయిస్టు పార్టీ సానుభూతిపరులు 11 మంది జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ అదనపు ఎస్పీ దిరాజ్ ఎదుట స్వచ్ఛందంగా లొంగిపోయారు.

ఈ సందర్భంగా పాడేరులో ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న అభివృద్ధి,సంక్షేమాన్ని ఆకర్షితులై మావోయిస్టు పార్టీ ప్రభావం తగ్గడంతో వీరు స్వచ్ఛందంగా లొంగిపోతున్నారని అన్నారు. వీరి పైన గతంలో పలు కేసులు ఉన్నాయని స్వచ్చందంగా లొంగిపోవడంతో ఎటువంటి కేసులు లేకుండా జనజీవన స్రవంతిలో కలిసి సమాజ శ్రేయస్సుకి కృషి చేయాలన్నారు.ప్రభుత్వం కల్పిస్తున్న సంక్షేమ పథకాలు, సదుపాయాలు, సద్వినియోగం చేసుకొని వ్యక్తిగతంగా అభివృద్ధి చెందాలని కుటుంబ సభ్యులతో అభివృద్ధి పథంలో నడిచే విధంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
లొంగిపోయిన మావోయిస్టు సానుభూతిపరులకు ప్రభుత్వపరంగా రావలసిన అన్ని రాయితీలను సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటామని అన్నారు.

మావోయిస్టు పార్టీని వీడి జనజీవన స్రవంతిలో కలవాలనుకునే సభ్యులు స్వచ్ఛందంగా గాని బంధుమిత్రుల ద్వారా గాని తమ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ లో గాని లేదా జిల్లా పోలీసు ఉన్నత అధికారుల వద్ద గాని సంప్రదించి లొంగిపోవచ్చని అన్నారు.జిల్లాలో పూర్తిగా మావోయిస్టు ప్రభావం తగ్గిందని అన్నారు.