News

సోషల్ మీడియాలో మీమ్ పోస్ట్ చేసిన వ్యక్తిపై ఐదుగురి దాడి.. తీవ్ర గాయాలు

344views

సోషల్ మీడియాలో మీమ్ వీడియో షేర్ చేసిన నుమాన్ నూర్ మహ్మద్ ఠాకూర్ పై మూక దాడి జరిగింది. ఈదుల్ ఫితర్ సందర్భంగా దుబాయ్ నుంచి భారత్ కి చేరుకున్నాడు. అయితే.. ఇన్ స్టా వేదికగా ఓ మీమ్ పోస్ట్ చేశాడు. అందులో కొంత మంది గ్రామస్థులు కుక్కతో కలిసి డ్యాన్స్ చేసిన వీడియోను షేర్ చేశారు. ఆ కుక్కకి స్థానికుల పేరు పెట్టారు. తమను ఉద్దేశించే ఈ వీడియో షేర్ చేశారన్న ఉద్దేశంతో ఐదుగురు నుమాన్ నూర్ పై దాడికి దిగారు. దీంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆస్పత్రికి తరలించారు.

వసీమ్ షేక్, ఇమ్రాన్, తన్వీర్ ఖాన్, ఫరూక్ అనే వ్యక్తులందరూ ఒకే ప్రాంతంలో వుంటారని పోలీసులు తెలిపారు. ఎప్పుడైతే నుమాన్ నూర్ ముంబై చేరుకున్నాడో… ఈ నలుగురు తిట్టడం ప్రారంభించారు. అలాగే పదునైన ఆయుధాలతో దాడికి దిగారని నుమాన్ నూర్ తెలిపాడు. అలాగే 1.86 లక్షల రూపాయలను కూడా దొంగలించారన్నాడు. మరోవైపు దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.