News

అన్యమతస్థుడితో వెంకన్న చరిత్ర ప్రచారం

1.2kviews

తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లిలో గల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దివ్య చరిత్రను ఒక అన్య మతస్థుడితో ప్రచారం చేయించడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

వివరాల్లోకి వెళితే వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం దేవాదాయ పరిధిలో ఉండడంతో దేవాదాయ శాఖ శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దివ్య చరిత్రను చుట్టుపక్కల గ్రామాలలో ప్రచారం చేయించాలని నిర్ణయించింది. దానికోసం రామచంద్రపురానికి చెందిన బుర్రకథ కళాకారుల బృందాన్ని నియమించింది.

కళాకారులు ఈశ్వరరావు, ప్రేమానందం, బాబూ రావులు వద్దిపర్రు, ర్యాలీ గ్రామాలలో బుర్రకథ ప్రదర్శనలు చేపట్టారు. ర్యాలీలోని జగన్మోహిని కేశవా స్వామి ఆలయం వద్ద ప్రదర్శన ఇస్తున్న సందర్భంలో “భక్తులు గుడికి వచ్చేది ప్రసాదం కోసమే” అని వారిలో ఒకరు వ్యాఖ్యానించారు. దీంతో ఆగ్రహించిన భక్తులు ఆయనను నిలదీశారు. ఆ సమయంలో ఆయన మెడలో శిలువ, చేతికి మేరీమాత ఉంగరాలు ఉండటాన్ని భక్తులు గుర్తించారు. దీంతో అన్య మతస్థుడితో స్వామి వారి చరిత్రను ప్రచారం చేయించడం ఏమిటని ప్రశ్నిస్తూ భక్తులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దీంతో బుర్రకథ ప్రదర్శనలు నిలిపివేస్తున్నట్లు ఆలయ సూపరింటెండెంట్ మీసాల రాధాకృష్ణ ప్రకటించారు. ఈ వ్యవహారంపై భక్తులు దేవాదాయ శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.

మరిన్ని జాతీయఅంతర్జాతీయ వార్తలువిశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.