News

దేవాలయాలకు నిఘా నేత్రాలు ఏర్పాటు చేయాలి

252views

పార్వతీపురం పట్టణంలో ఉన్న దేవాలయాలు, ప్రార్థనా మందిరాలకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని పట్టణ సీఐ కె. మురళీధర్ కోరారు ఈ మేరకు ఆయన పట్టణ పోలీస్ స్టేషన్లో పలువురు మతపెద్దలతో సమావేశం ఏర్పాటు చేశారు. పట్టణంలో 32 హిందూ దేవాలయాలు, 3 మసీదులు, 13 చర్చిలు, అలాగే పట్టణంలో ఉన్న పలు కూడళ్ల వద్ద ముఖ్య నేతల విగ్రహాలకు నిఘా నేత్రాలను ఏర్పాటు చేయాలని కోరారు. ఈ మేరకు పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన బృందం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాలని చెప్పారు. ఈ ఏర్పాటులో ప్రార్థనాలయాల పెద్దలు, కమిటీ సభ్యులు సహకరించాలని స్వచ్ఛందంగా ముందుకు రావాలని సీఐ కోరారు.