News

నియంత్రణ రేఖను దాటిన పాక్‌ ఆర్మీ.. దీటుగా బదులిచ్చిన భారత సైన్యం

391views

భారత్‌-పాక్ సరిహద్దు వద్ద అలజడి చోటుచేసుకుంది. దాయాది దేశ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్మూకశ్మీర్‌లోని పూంచ్‌ జిల్లాలో నియంత్రణ రేఖ వద్ద వద్ద పాక్‌ ఆర్మీ చొరబాట్లకు పాల్పడిందని భారత సైనిక వర్గాలు వెల్లడించాయి.

‘‘ఏప్రిల్ 1న కృష్ణ ఘాటి సెక్టార్‌ వద్ద పాక్‌ ఆర్మీ చొరబాట్లకు పాల్పడింది. దాంతో అక్కడ మందుపాతర పేలిన ఘటన చోటుచేసుకుంది. తరువాత పాక్‌ సైన్యం కాల్పులు జరిపి, ఒప్పందాన్ని ఉల్లంఘించింది. ఈ ఘటనపై మా ఆర్మీ దీటుగా బదులిచ్చింది. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉంది’’ అని పేర్కొన్నాయి. ఈ ఘటనపై ప్రాణనష్టం గురించి వివరాలు వెల్లడికావాల్సి ఉంది.