ArticlesNews

నా పిల్లలు భారత్‌లోనే పెరగాలి ఎందుకంటే..? వైరల్‌గా అమెరికన్‌ తల్లి పోస్ట్‌

389views

అందాల అమెరికా అంటే మన భారత యువతకు ఓ బ్యూటీఫుల్‌ డ్రీమ్‌. ఆ కల సాకారం చేసుకోవడానికి తల్లిదండ్రులను కష్టపెట్టడమే కాకుండా తమన తాము ఇబ్బందుల్లోకి నెట్టుకుని మరీ తిప్పలు పడతారు. ఇలా ఏటా వేలాదిమంది యువత అమెరికాలో సెటిల్‌ అయ్యేందుకు ఎన్నో పాట్లుపడుతున్నారు. మనం ఇంతలా ప్రయాస పడుతుంటే ఓ అమెరికన్‌ అమ్మ మాత్రం సింపుల్‌గా అసలైన ఆనందం భారత్‌లోనే ఉందని మన దేశాన్ని ఆకాశానికి ఎత్తేసేలా కీర్తించింది. అంతేకాదండోయ్‌ సంపాదన పరంగా అమెరికా బెస్ట్‌ ఏమో కానీ సంతోషం మాత్రం భారత్‌లోనే దొరకుతుందని దిమ్మతిరిగేలా సమాధానమిచ్చింది ఆ తల్లి. అదెలాగో ఆమె మాటల్లోనే విందామా..!

గత నాలుగు సంత్సరాలు ఢిల్లీలో నివశిస్తున్న అమెరికన్‌ మహిళ క్రిస్టెన్‌ ఫిషర్‌ తన పిల్లలు యునైటెడ్‌ స్టేట్స్‌ వద్దని భారత్‌లోనే ఎందుకు పెంచాలనుకుంటుందో షేర్‌ చేసుకుంది. స్కైఫిష్‌ డెవలప్‌మెంట్‌ కంటెంట్‌ క్రియేటర్‌ అయిన క్రిస్టెన్‌ ముగ్గురు పిల్లల తల్లి. ఆమె తన పిల్లలు భారతదేశంలోనే పెరిగితేనే ప్రయోజకులు అవుతారని విశ్వసిస్తున్నా అంటూ ఓ వీడియోను ఇన్‌స్టాలో షేర్‌ చేవారు. అదెలాగో కూడా సవివరంగా వెల్లడించింది.

అమెరికాలో కంటే వారి బాల్యం భారత్‌లోనే గడిస్తేనే ఎందుకు మంచిదో.. ఎనిమిది కారణాలను వివరించారామె. అవేంటంటే..

భావోద్వేగాలను హ్యాండిల్‌ చేయడం: భారతదేశంలో నివశిస్తే తన పిల్లలు విభిన్న వ్యక్తులు, వారి సంస్కృతులను చాలా సులభంగా అర్థం చేసుకోగలుగుతారు. దీనివల్ల సామజిక నైపుణ్యాలు మెరగవ్వడమే కాకుండా సానుభూతిగా వ్యవహరించడం ఎలాగో తెలుస్తుంది.

స్ట్రాంగ్‌ రిలేషన్స్‌: భారతీయుల కుటుంబాల్లో బలమైన సన్నిహిత సంబంధాలు ఉంటాయి. తమ పిల్లలే అన్న భావనతో కూడిన ఐక్యత ఉంటుంది. ఇది వారికి భావోద్వేగ మద్దతును అందిస్తుంది. అందువల్ల వాళ్లు ఈ వాతావరణంలో పెరిగితే గనుక అమెరికాలోని వ్యక్తిగత సంస్కృతికి భిన్నంగా లోతైన సంబంధాలు ఎలా ఏర్పరుచుకోవాలో తెలుసుకుంటారు.

కృతజ్ఞత, సద్దుకుపోవడం: సంపద, పేదరికం మధ్య స్పష్టమైన వ్యత్యాసాలు ఉండే కొన్ని ప్రాంతాల్లో ఆయా పరిస్థితులకు అనుగుణంగా బతకడం, సర్దుకుపోవడం వంటివి తెలుసుకుంటారు. ఆ పరిస్థితుల మద్య వాళ్లు కృతజ్ఞుడుగా ఉండటం, అవతలి వాళ్లని మనస్ఫూర్తిగా అభినందించడం వంటివి తెలుసుకుంటారు.

గ్లోబల్ నెట్‌వర్క్‌ కనెక్షన్‌: అంతేగాదు ఇక్కడ పెరిగితే ప్రపంచంలోని వివిధ ప్రాంతాల వాళ్లు స్నేహితులవుతారు. ఇది వారికి ప్రపంచ నెట్‌వర్క్‌ను నిర్మించడంలో సహయపడతుంది. ఈ సంబంధాలు పిల్లలకు భవిష్యత్తులో మంచి కెరీర్‌కు నిర్మించుకోవడానికి హెల్ప్‌ అవుతాయి.

ఇలా ఆ ఆమెరికన్‌ తల్లి క్రిస్టెన్ ఫిషర్ ఇక్కడే తన పిల్లలు పెరిగితే గొప్పవాళ్లు అవుతారని మనస్ఫూర్తిగా నమ్ముతానంటూ తన అభిప్రాయాన్ని వెలిబుచ్చింది. అంతేగాదు అమెరికాను వ్యక్తిత్వం కలిగిన దేశంగా, సామాజికంగా ఒంటరిగా ఉన్న దేశంగా అభివర్ణించింది. అయితే భారతదేశం అందర్నీ స్వాగతిస్తూ సంబంధాలను నెరుపుతూ ఆనందంగా జీవించడం ఎలాగో నేర్పి‍స్తుంది.

పైగా ఒకరికొకరు సహాయ చేసుకోవడం అంటే ఏంటో నేర్పిస్తుంది. అందువ్లల తన పిల్లలు ఈ వాతావరణంలో పెరిగితే దినదినాభివృద్ధి చెందుతారని నమ్మకంగా చెప్పారు క్రిస్టిన్‌. కాగా, ఆమె గతేడాది అమెరికాని వీడుతూ భారత్‌లోనే ఎందుకు నివశించాలనుకుంటుందో వివరిస్తూ ఓ వీడియోని షేర్‌ చేశారామె.