News

ఒంగోలులో విహెచ్‌పి పురప్రముఖుల సమావేశం

247views

దేశంలోని హిందూ దేవాలయాలను ప్రభుత్వ నియంత్రణ నుంచి బయటకు తీసుకువచ్చేందుకు విశ్వహిందూ పరిషత్-విహెచ్‌పి కృషి చేస్తోందని విశ్వహిందూపరిషత్ అఖిల భారత సంస్దాగత ప్రధాన కార్యదర్శి మిలింద్ పరాండే అన్నారు. ఒంగోలులోని ఆంధ్రకేసరి విద్యా కేంద్రం ప్రాంగణంలో విశ్వహిందూపరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన పురప్రముఖుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సమావేశంలో విశ్వహిందూపరిషత్ నాయకులు కోటేశ్వరశర్మ, యక్కల రాఘవులు, విష్ణువర్దన్ రెడ్డి పాల్గొన్నారు. సమావేశంలో పాల్గొన్న నాయకులు హిందూ ధర్మ పరిరక్షణకు పరిషత్ చేస్తున్న కార్యక్రమాల గురించి వివరించారు.

ఈ సందర్బంగా మిలింద్ పరాండే మాట్లాడుతూ, దేవాలయాలను ప్రభుత్వ నియంత్రణ నుంచి తప్పించాలని, మతమార్పిడులను నివారించాలని, లవ్ జీహాద్ వంటి వాటి నుంచి హిందూ సమాజాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. విశ్వహిందూ పరిషత్ ద్వారా బలహీన వర్గాల ప్రజలకు సేవాకార్యక్రమాలను చేపడుతున్నామని వీటిని మరింత విస్తృతం చేస్తామన్నారు. హిందూ సంస్కృతి పరిరక్షణ, ఆధ్యాత్మిక విలువలను పెంపొందించడం వంటి విషయాలపై కూడా పరిషత్ కృషి చేస్తోందన్నారు.

భగవద్గీత ఒక విశిష్ట గ్రంథమని దీనిని పాఠ్యాంశంగా చేయడంతో పాటు ప్రతి ఇంట్లోనూ పిల్లలకు బోధించాలన్నారు. ఆధ్యాత్మిక పరిరక్షణ విషయంలో మన ఆలోచనల్లో మార్పు రావాలన్నారు. నేటి యువత మత్తు పదార్దాల మోజులో పడి పాడైపోతున్నారని దీనిని అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.