News

సంభల్‌ మసీదు కమిటీ అధ్యక్షుడి అరెస్టు

579views

ఉత్తర్‌ప్రదేశ్‌లోని సంభల్‌లో ఉన్న వివాదాస్పద షాహీ జామా మసీదు కమిటీ అధ్యక్షుడు జఫర్‌ అలీని పోలీసులు అరెస్టు చేశారు. మొగలుల కాలానికి చెందిన ఈ మసీదు సర్వేకు గతేడాది నవంబరు 19న స్థానిక కోర్టు ఆదేశాలు జారీ చేసింది. హరిహర్‌ మందిరాన్ని కూల్చి ఈ మసీదును నిర్మించారని హిందూ పక్షం దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ ఉత్తర్వులను న్యాయస్థానం వెలువరించింది. నవంబరు 24న అధికారులు సర్వే చేస్తున్న సమయంలో హింస చెలరేగింది. నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇందుకు సంబంధించి పలు ఎఫ్‌ఐఆర్‌లు దాఖలయ్యాయి. ఇందులో జఫర్‌ అలీ పేరు కూడా ఉంది. చట్టవిరుద్ధంగా జనాన్ని సమీకరించి హింసను ప్రేరేపించారని, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారని పేర్కొంటూ పలు సెక్షన్ల కింద ఆయనపై పోలీసలు కేసు నమోదు చేశారు.