
264views
శ్రీవారి ఆలయంలో 25, 30వ తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు తితిదే శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. 25న కోయిల్‌ఆళ్వార్ తిరుమంజనం, 30న ఉగాది పురస్కరించుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. దీంతో 24, 29వ తేదీల్లో ఎలాంటి సిఫారసు లేఖలు స్వీకరించబోమని స్పష్టం చేసింది. తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను ఈ నెల 23న స్వీకరించి 24న దర్శనానికి అనుమతించనున్నట్లు తెలిపింది.





