News

దేవాలయ ఆస్తులతో రిసార్టులా? కుదరదన్న మద్రాస్ హైకోర్టు

323views

దేవాలయాల నుంచి వచ్చే ఆదాయాన్ని ఊటీలో రిసార్టులు కట్టకూడదని మద్రాసు హైకోర్టు ఆదేశించింది. పొల్లాచ్చి ఆలయంలోని మిగులు ఆదాయం నుంచి 14 కోట్లతో ఊటీ రిసార్టు కట్టాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిని వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన మద్రాసు హైకోర్టు… దేవాలయాల నుంచి వచ్చే ఆదాయాన్ని HR&CE చట్టంలో చెప్పిన అవసరాల కోసం మాత్రమే వినియోగించాలని, రిసార్టులు కట్టడానికి కాదని తేల్చి చెప్పింది.

మసానీ అమ్మ దేవాలయంలో కోయంబత్తూరులోని పొల్లాచ్చి ప్రాంతంలో వుందని, ఈ దేవాలయం HRCE శాఖ ఆధ్వర్యంలో నడుస్తోందన్నారు. ఈ దేవాలయానికి చాలా మంది భక్తులు వస్తుంటారని, అలాగే 100 కోట్ల ఫిక్స్ డ్ డిపాజిట్లు ఈ దేవాలయానికి వున్నాయని పిటిషనర్ భాస్కర్ కోర్టుకు తెలిపారు.భక్తులు భూములు, ధనాన్ని దేవుడి కోసం ఇచ్చారని, వీటిని ధార్మిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాల కోసం వినియోగించడానికి ఇచ్చారన్నారు .శ్రీరంగం దేవాలయానికి సంబంధించిన చెట్టియార్ కేసులో కూడా ఇలాగే జరిగితే.. సుప్రీంకోర్టు ఓ తీర్పుచ్చిందని, అదే తీర్పును ఈ కేసులో కూడా అన్వయించుకోవచ్చని పేర్కొన్నారు.

భక్తుల ఆక్షేపణలు ఏమాత్రం తెలుసుకోకుండా, పరిగణనలోకి తీసుకోకుండా ఫిక్స్ డ్ డిపాజిట్లని బ్రేక్ చేయకూడదని, ఈ ఆర్డరును నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులైనా ఇవ్వాలని, లేదంటే ఆర్డర్ ని వెనక్కి తీసుకోవాలని కోరారు.

అయితే.. ఈ క్రమంలో దేవాలయ ఆదాయంతో ప్రభుత్వం రిసార్టులు నిర్మించాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ఈ విషయాన్ని కోర్టుకు కూడా తెలిపింది.