News

ఆర్ఎస్ఎస్ నగర శాఖల సంగమం

408views

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ శతవసంతాల వేడుకల్లో భాగంగా నిజామాబాద్ జిల్లాలోని ఇందూరులో నగర శాఖల సంగమం నిర్వహించినట్లు నగర కార్యవాహ అర్గుల సత్యం తెలిపారు. మొత్తం 56 శాఖల ప్రతినిధులు సంగమంలో పాల్గొన్నారని పేర్కొన్నారు. కార్యక్రమం జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలమైదానంలో ఉదయం 7 గంటలకు నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు, హిందువులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారని తెలిపారు.