News

11 మంది మావోయిస్ట్ సభ్యులు లొంగబాటు..

330views

నిషేదిత సీపీఐ (మావోయిస్ట్) పార్టీ గాలికొండ ఏరియా కమిటీకు చెందిన 11 మంది మిలీషియా సభ్యులు అల్లూరి సీతారామరాజు జిల్లా, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్,అమిత్ బర్దార్, అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (అడ్మిన్),కె. దీరజ్, అసిస్టెంట్ సూపరింటిండెంట్ ఆఫ్ పోలీస్, నవజ్యోతి మిశ్రా చింతపల్లి వారి ఎదుట జన జీవన స్రవంతిలో కలవడానికి స్వచ్ఛందంగా లొంగిపోయారు.

జి.కె. వీధి, కొయ్యూరు, మండలాలలో అనేక మారుమూల ప్రాంతాలు మరియు వీరవరం, నల్లబిల్లి, పెద్ద అగ్రహారం, చిన్న అగ్రహారం, ప్రాంతాల లో అనేక నేరాలకు పాల్పడిన ఈ మిలీషియ సభ్యులు, మావోయిస్టు పార్టీ అవలబిస్తున్న కాలం చెల్లిన సిద్ధాంతాలకు విసుగు చెంది మావోయిస్టు పార్టీ కార్యకలాపాలను వీడాలని, అల్లూరి సీతారామరాజు జిల్లా పోలీసు వారు కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా చేపట్టిన స్ఫూర్తి, ప్రేరణ, నిర్మాణ్, సరళ్ వంటి కార్యక్రమాల ద్వారా అనేక మంది గిరిజన యువతియువకులు ఉద్యోగ ఉపాది అవకాశాలు పొందుతున్నారని, తెలుసుకొని లొంగిపోయినట్లు పేర్కొన్నారు.

అదేవిధంగా పోలీసు వారు ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపులు, జాగృతి వంటి అవగాహన కార్యక్రమాలు, జి.కె. వీధి, కొయ్యూరు మండలాలో కోర్ ఏరియాలాలో జియో, ఎయిర్టెల్, బిఎస్ఎన్ఎల్ఎ సహా దాదాపు 75 సెల్ టవర్లను ఏర్పాటు చేయడం, మారుమూల ప్రాంతాలైన కుంకుంపూడి, చిన్న అగ్రహారం, వంటి ప్రాంతాలకు రోడ్లు పూర్తి చేయడం జిల్లాలోని అన్ని ప్రధాన ప్రాంతాలకు మరిన్ని రోడ్లు వేయబడుతున్నాయని, ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని గ్రహిస్తున్నామని అన్నారు.

ప్రస్తుత రహదారి సదుపాయాలు కారణంగా, ప్రజలు అన్ని ముఖ్యమైన ప్రదేశాలకు అంటే, మండల ప్రధాన కార్యాలయాలు, ఆసుపత్రులు, సంతలు, పాఠశాలలు, కళాశాలలు మొదలైన వాటికి ప్రభుత్వ, ప్రైవేట్ వాహనాల ద్వారా సులభంగా రవాణా చేయగలుగుతున్నారు. అదేవిదంగా ప్రభుత్వ నిర్మాణాత్మక విధానం, అభివృద్ధి పథకాలకు ఆకర్షితులై నేడు జన జీవన స్రవంతిలో కలిసి పోలీసు వారి ఎదుట స్వచ్ఛందంగా లొంగిపోయామని తెలిపారు.