
సీబీఎస్ న్యూస్ అనే మీడియా సంస్థ ఉంది. అది సీబీఎస్ మార్నింగ్స్ అనే శీర్షికను వెలువరిస్తూ ఉంటుంది. ఆ శీర్షిక కింద ఫిబ్రవరి 28న వచ్చిన కార్యక్రమం కాస్త విస్తుగొలిపే విధంగానే ఉంది. అదేమిటంటే, అమెరికా జైళ్లలో ఎక్కడ చూసినా నెలవంకేనట. అంటే ముస్లింల నెలవంక. అమెరికా జైళ్లలో ప్రతి ఏటా వందల సంఖ్యలో ఖైదీలు ఇస్లాంలోకి మారిపోతున్నారట. త్యాబా ఫౌండేషన్ అనే సంస్థ అమెరికా జైళ్లలో ఉన్నవారికి ఇస్లాం విద్యను అందించే పనిని చేపట్టింది. ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టింది కూడా ఆ సంస్థే. రెమినౌర్ దాని సంచాలకుడు, ఇస్లాంను పాటించడం, దానిలోని ఆచరాలు, వాటిని అనుసరించే విధానం ఏమిటో ఎలాగో తమకు తెలియచేయవలసిందని జైళ్ల నుంచి కోరుతున్న వారి మెసేజ్లతో తన ఫోన్ నిండిపోతున్నదని చెబుతున్నాడతడు. అమెరికాలో ఉన్న జైళ్లన్నింటి నుంచి ఇలాంటి మెసేజ్లు కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతున్నాయంటున్నాడతడు. నిజానికి ఆ ఫౌండేషనన్ను 15 ఏళ్ల క్రితం ముస్లిం ఖైదీల కోసం ప్రారంభించారు. కానీ ఇప్పుడు దాని -విస్తృతి బాగా పెరిగిపోయింది. వారి అవసరాల మేరకు తమ విద్యా కార్యక్రమాన్ని బాగా విస్తరించామని రెమి నౌర్ చెబుతున్నాడు. ఈ 15 సంవత్సరాలలో ఆ ఫౌండేషన్కి ఇస్లాం, దాని అనుసరణ గురించి 13,000 మందికి బోధించింది. అందులో ఇస్లాం స్వీకరించడానికి 90 శాతం ఇప్పుడు సిద్ధంగా ఉన్నారట. తెలిసో తెలియకో అసలు విషయం కూడా అతడు కక్కేశాడు. జైలు గోడలు తమను ఆపలేవన్న నమ్మకాన్ని తమ విద్య ఇస్లాం ఖైదీలలో రేకెత్తించిందని చెప్పాడు. హత్య కేసులో పట్టుబడి 30 ఏళ్ల జైలు శిక్ష పడిన మహమ్మద్ అమీన్ అండర్సన్ అనే ఖైదీ రెండేళ్ల శిక్షాకాలం తరువాత ఇస్లాం స్వీకరించాడట. అతడు ఇస్లాం స్వీకరించడానికి చాలా కారణాలు ఉన్నా. ఆధ్యాత్మిక స్వేచ్ఛ అందులో మొదటిదని రెమి భాష్యం చెబుతున్నాడు. ఇక్కడ అండర్సన్ నేపథ్యం కూడా కాస్త తెలుసుకో వాలి. ఇతడి అసలు పేరు క్రిప్టోఫర్ అండర్సన్, ఫిలడెల్ఫియాకు చెందినవాడు. ఇతడి తండ్రి మతబోధకుడే అయినా, అండర్సన్ మాత్రం చట్ట విరుద్ధమైన, అనైతిక పనులు చేయడం మొదలు పెట్టాడు. ఇప్పుడు మానవత్వం పట్ల తనలో ఒక భావనను కలగచేసినది ఇస్లాం అంటున్నాడు





