News

జన్మభూమి ఎక్స్‌ప్రెస్​ సికింద్రాబాద్‌ స్టాప్‌ రద్దు

304views

విశాఖపట్నం-లింగంపల్లి-విశాఖపట్నం మధ్య నడిచే జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ (Janmabhoomi Express)కు సికింద్రాబాద్‌లో స్టాప్‌ను రద్దు చేశారు. ఏప్రిల్‌ 25 నుంచి ఇది అమల్లోకి వస్తుందని రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైలును చర్లపల్లి-అమ్ముగూడ-సనత్‌నగర్‌ మీదుగా శాశ్వత ప్రాతిపదికన దారి మళ్లిస్తున్నట్లు చెప్పారు. ఏప్రిల్‌ 25 నుంచి సికింద్రాబాద్‌, బేగంపేట్‌ స్టేషన్ల వైపు వెళ్లదని అధికారులు తెలిపారు. జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ విశాఖపట్నం-లింగంపల్లి-విశాఖపట్నం మధ్య ప్రతి రోజూ నడుస్తోందని అధికారులు తెలిపారు.