
227views
రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని మోదీ మంగళవారం మారిషస్ వెళ్లారు. వెళ్తూ ఆయన వెంట కుంభమేళా సమయంలో సేకరించిన పవిత్ర గంగాజలాన్ని తీసుకువెళ్లారు. వాటిని మారిషస్ అఽధ్యక్షుడు ధరమ్ గోకుల్‌కు బహూకరించారు. ఆయన సతీమణికి బనారస్ చీరను బహుమతిగా ఇచ్చారు. మరోవైపు, ప్రధాని మోదీకి ఆ దేశ ప్రధాని నవీన్ రామ్.. మారిషస్ అత్యున్నత పురస్కారమైన ‘ది గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ అండ్ కీ ఆఫ్ ది ఇండియన్ ఓషెన్ అవార్డు’ను బహూకరించారు.





