News

‘ఆదిచిత్తర’ గిరిజన చిత్రకారుల సమ్మేళనం

298views

విజయనగరంలోని కేంద్రీయ గిరిజన విశ్వ విద్యాలయం, మాన్సస్ విద్యాసంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ‘ఆదిచిత్తర : నేషనల్ ట్రైబల్ పెయింటర్స్ కాన్క్లేవ్’ పేరుతో రెండు రోజుల జాతీయ గిరిజన చిత్రకారుల సమ్మేళనం విజయవంతంగా ముగిసింది. విజయనగరం కోటలో జరిగిన ఈ కార్యక్రమంలో 26 రకాల గిరిజన చిత్రకారులు 12 రాష్ట్రాల నుంచి పాల్గొన్నారు.

అనంతరం వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన చిత్ర కారులకు సర్టిఫికెట్లు ప్రధానం చేశారు. గోండ్, వార్లీ, పిథోర, కోలం, సోహ్రాయ్, ఖోవర్, కోయా, కురుంబా, తంగ్‌ఖుల్-నాగా, నాయకపోడు, సవర, సౌరా, మురియా, భిల్ వంటి విభిన్న కళారూపాలకు ప్రాతినిధ్యం వహిస్తూ దేశవ్యాప్తంగా ఉన్న గిరిజన చిత్రకారులను ఈ సదస్సు ఐక్యం చేసిందని, విజయనగరం ప్రజలకు గిరిజన చిత్రాల పట్ల అవగాహన పెంపొందించుకొనే అవకాశం వచ్చిందని ప్రొఫెసర్ జితేంద్ర మోహన్ మిశ్రా అన్నారు.