News

బిహార్ లో హిందూ దేవతల విగ్రహాలు ధ్వంసం.. హిందువుల ఆందోళన

222views

బిహార్ లోని సీతామర్హి ప్రాంతంలోని ఓ శివాలయంలో దుండగులు దేవతా విగ్రహాలను ధ్వంసం చేశారు. రెండు రోజుల క్రితం కొందరు దుండగులు ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించి, గణేషుడు, సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలను తొలగించి, బయటకి విసిరేశారు. దీంతో పాటు దేవాలయ అర్చకుని నివాసానికి కూడా దుండగులు తగలబెట్టారు. ఉదయం గ్రామస్థులకు ఈ విషయం తెలియడంతో స్థానిక హిందువులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. అప్పుడు అధికారులకు ఈ విషయం తెలిసింది.

మరోవైపు పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకొని, పరిశీలించారు. దుండుగులను వెంటనే పట్టుకొని, శిక్షిస్తామని స్థానిక హిందువులకు హామీ ఇచ్చారు.శివరాత్రి ఉత్సవాలు ముగిసిన తర్వాత ఓ వర్గం వారు కావాలనే ఈ పని చేశారన్నది స్థానికులు అభిప్రాయమని పోలీసులు తెలిపారు.

మరో వైపు గత రెండు నెలల్లో ఈ ప్రాంతంలో ఇలాంటి ఘటన జరగడం ఐదోసారి అని స్థానికులు పేర్కొంటున్నారు. దుండుగులు కావాలనే ఇలా చేస్తున్నారని, వారిని వెంటనే పట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు పోలీసులు కూడా దర్యాప్తు ప్రారంభించారు.