
వచ్చే ఐదేళ్లలో హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్, ప్రయాగ్ రాజ్ ప్రాంతాల్లో కుంభమేళా జరగనుంది. 2027లో హరిద్వార్‌లో అర్ధ కుంభమేళా నిర్వహించనున్నారు. అర్ధ కుంభమేళా అంటే ఆరేళ్లకు ఒకసారి వస్తుంది. కుంభమేళా 12 ఏళ్లకు ఒకసారి నిర్వహిస్తారు. చివరి అర్ధ కుంభమేళా 2021లో హరిద్వార్‌లో జరిగింది. ఈ క్రమంలో 2027లో అర్ధ కుంభమేళా నిర్వహించేందుకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. మరోవైపు 12 ఏళ్ల తర్వాత వస్తున్న కుంభమేళా ఈసారి 2027లో నాసిక్‌లో జరగనుంది.
సమాచారం ప్రకారం ఈ కార్యక్రమం జూలై 17, 2027న ప్రారంభమై, ఆగస్టు 17, 2027న ముగియనున్నట్లు తెలుస్తోంది. ఇది నాసిక్ నుంచి సుమారు 38 కిలోమీటర్ల దూరంలో ఉన్న గోదావరి నది ఒడ్డున ఉన్న త్రయంబకేశ్వర్‌లో జరగనుంది. 2028లో 12 ఏళ్లకు ఒకసారి జరిగే సింహస్థ కుంభమేళా ఉజ్జయినిలో జరగనుంది. ఆ తర్వాత 2030లో ప్రయాగ్‌రాజ్ లో అర్ధ కుంభమేళా నిర్వహించనున్నారు.





