
ఉత్తరప్రదేశ్ లోని సంభల్లో మొగలుల కాలం నాటి షాహీ జామా మసీదు సమీపంలో ఉన్న బావి పునరుద్ధరణ పనులపై ఇటీవల వివాదం చెలరేగిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తాజాగా ఓ నివేదిక సమర్పించింది. స్థానికంగా ‘ధరణీ వరాహ్ కూప్’గా పిలిచే ఆ బావి ప్రభుత్వ భూమిలోనే ఉందని స్పష్టం చేసింది. మసీదుతో దానికి సంబంధం లేదని పేర్కొంది. మసీదు ప్రాంగణంలోనే బావి ఉన్నట్లు పిటిషనర్ చేస్తున్న వాదన సరికాదని తెలిపింది. అన్ని వర్గాల ప్రజల వినియోగానికి వీలుగా స్థానిక జిల్లా అధికార యంత్రాంగం మొత్తం 19 బావులను పునరుద్ధరించేందుకు కృషి చేస్తోందని.. వాటిలో ‘ధరణీ వరాహ్ కూప్’ ఒకటని వెల్లడిం చింది. షాహీ జామా మసీదు ప్రాంగణంలోని బావిని అధికారులు సర్వే చేయడాన్ని వ్యతిరేకిస్తూ మసీదు నిర్వహణ కమిటీ పిటిషన్ వేసిన నేప థ్యంలో.. అక్కడి పరిస్థితులపై నివేదిక సమర్పించాలని గత నెల 10న యూపీ సర్కారును సుప్రీంకోర్టు ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచే సిన ముగ్గురు సభ్యుల కమిటీ క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించి. . భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్ ధర్మాసనానికి తాజాగా ఈ నివేదికను సమర్పించింది.





