
309views
భారత్ ఇప్పటికీ సైన్సుకు అంతుపట్టని అనేక విషయాలను మన రుషులు, మునులు, సాధుసంతులు, యోగులు లక్షల సంవత్సరాల క్రితమే ఒక శాస్త్రీయ వివేకముతో మానవాళికి అందించారని ఫిబ్రవరి 12న హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో బాపట్ల జిల్లా, చీరాల మండలం, వాడరేవు గ్రామంలో జరిగిన సామూహిక సాగర హారతి కార్యక్రమంలో ముఖ్యవక్తగా పాల్గొన్న రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్-ఆర్ఎస్ఎస్ గుంటూరు విభాగ్ ప్రచారప్రముఖ్ అవ్వారు శ్రీనివాసులు తెలిపారు. కార్యక్రమంలో హిందూ చైతన్య వేదిక జిల్లా సహ సంయోజక్ బండారు జ్వాలా నరసింహం, డాక్టర్ తాడివలస దేవరాజు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.





