
324views
ఫిబ్రవరి 26.. మహాశివరాత్రి వేళ భక్తులు కాశీవిశ్వేశ్వరుణ్ణి మరింత సమయం దర్శించుకునేందుకు అవకాశం కలిగింది. 26న తొలి మంగళహారతి మొదలుకొని 27న జరిగే శయన హారతి వరకూ భక్తులు మహాశివుణ్ణి దర్శించుకోవచ్చు. ఆ రోజున పార్వతీ పరమేశ్వరుల కల్యాణం ఎనిమిది గంటలపాటు జరగనుంది.
కాశీ విశ్వనాథుని ఆలయ అధికారి విశ్వభూషణ్ శివరాత్రి ఏర్పాట్ల గురించి మీడియాకు తెలిపారు. ఫిబ్రవరి 25న శయన హారతి అనంతరం గర్భగుడిని మూసివేస్తామన్నారు. అనంతరం 26న తెల్లవారుజామున 2:30కి మహాశివునికి మంగళహారతి ఇస్తామన్నారు. ఇది పూర్తయ్యాక దర్శనాలు ప్రారంభమవుతాయన్నారు. ఫిబ్రవరి 27న జరిగే శయన హారతివరకూ ఆలయం తలుపులు తెరిచేవుంటాయన్నారు. ఈ సమయంలో భక్తులు స్వామివారిని సందర్శించుకోవచ్చన్నారు. మహా శివరాత్రివేళ సప్తరుషి శృంగార హారతి ఉండదన్నారు.





