
246views
మధ్యప్రదేశ్ లోని ఛతర్‌పుర్ లో జరిగిన ఖజురాహో 51వ నృత్య సమారోహం సందర్భంగా 139 మంది కళాకారులు 24 గంటలసేపు చేసిన సుదీర్ఘ శాస్త్రీయ నృత్యానికి గిన్నిస్ రికార్డు గౌరవం దక్కినట్లు అధికారులు శుక్రవారం వెల్లడించారు. బుధవారం మధ్యాహ్నం మొదలైన ఈ నృత్య కార్యక్రమం గురువారం మధ్యాహ్నం దాకా నిరంతరాయంగా కొనసాగింది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్‌కు గిన్నిస్ బృందం ధ్రువపత్రాన్ని అందజేసింది. రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఈ మారథాన్ నృత్యంలో కథక్, భరతనాట్యం, కూచిపూడి, మోహినీ అట్టం, ఒడిస్సీ నృత్యరీతులను కళాకారులు ప్రదర్శించారు.





