
గోళ్వాల్కర్ జయంతి, ఛత్రపతి శివాజీ జయంతి రోజే ఢిల్లీలో ఆరెస్సెస్ నూతన కార్యాలయం ప్రారంభం కావడం ఆనందంగా వుందని శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కోశాధికారి పూజ్య గోవింద దేవ్ గిరిజీ మహారాజ్ అన్నారు. సంఘ సైద్ధాంతిక దృక్పథమే శివాజీ మహారాజ్ అని పేర్కొన్నారు. సంఘ ప్రార్థన కంటే గొప్పదైన మంత్రమేమీ లేదని కంచి పరమాచార్యులు ప్రచారకులతోని అనేవారని గుర్తు చేశారు. న్యూఢిల్లీలో నూతనంగా నిర్మించిన ఆరెస్సెస్ కార్యాలయాన్ని (కేశవ కుంజ్) ని సరసంఘచాలక్ మోహన్ భాగవత్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పూజ్య గోవింద దేవ్ గిరిజీ మహారాజ్ కూడా హాజరయ్యారు.
తాజాగా విడుదలైన ఛావా చిత్రం గురించి కూడా గోవింద దేవ్ గిరిజీ మహారాజ్ మాట్లాడారు. ఛత్రపతి శివాజీ అలాంటి మావలలను సిద్ధం చేశారన్నారు. వారెవ్వరూ అలసిపోరని, ఆగిపోరని, అలాంటి వారిని తయారు చేశారన్నారు. సంఘ స్వయంసేవకులు ఛత్రపతి తయారు చేసిన మావలీల వంటి వారని కొనియాడారు. మనమంతా హిందూ భూమి పుత్రులమని, దాని క్షేమం కోసం పనిచేయాలన్నారు. సంఘ్ హిందూ భూమి సంప్రదాయాలను బలోపేతం చేస్తూనే, జాతి పురోగతి గురించి మాట్లాడుతుందని వివరించారు.





