
308views
మహా కుంభమేళాపై ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ చేసిన కామెంట్స్ పై కేంద్ర మాజీ మంత్రి, మహా మండలేశ్వర్ సాధ్వి నిరంజన్ జ్యోతి మండిపడ్డారు. శ్రీ రామజన్మభూమిలో మరుగు దొడ్లు నిర్మించాలని ఇదే లాలూ వ్యాఖ్యానించారన్నారు. లాలూ చేసిన అకృత్యాలకు ప్రజలు శిక్షలు విధించారని, మహా కుంభ్ ని అవమానించి మహా పాపం మూటగట్టుకున్నారన్నారు. వక్ఫ్ బోర్డు మాదిరిగానే సనాతన బోర్డు కూడా ఏర్పాటు చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.
దేశంలో సనాతన బోర్డు ఏర్పాటు చేయాలని, అప్పుడే హిందువులకు న్యాయం జరుగుతుందన్నారు. 2014 కి ముందు భారతీయుడు విదేశాలకు వెళ్లినప్పుడు భిన్నమైన దృక్పథం వుండేదని, కానీ నేడు పరిస్థితి పూర్తి భిన్నంగా వుందన్నారు. నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రపంచ స్థాయిలో భారత్ డిమాండ్, స్థాయి పెరిగిందన్నారు.





