
291views
ఆలిండియా ముస్లిం జమాత్ జాతీయ అధ్యక్షుడు మౌలానా షహబుద్దీన్ రజ్వీ బరేల్వీ వక్ఫ్ సవరణ బిల్లుకు మద్దతు పలికారు. వక్ఫ్ సవరణ బిల్లుతో సామాన్య ముస్లింలకు, మసీదులకు, మదర్సాలకు, దర్గాలకు వచ్చే నష్టమేమీ లేదని తేల్చి చెప్పారు. వక్ఫ్ ఆస్తులను దుర్వినియోగం చేసే వారిపై చర్యలు తీసుకోవడానికి పనికొస్తుందని, వక్ఫ్ సవరణ బిల్లుతో అవినీతిని కూడా అరికట్టవచ్చని తెలిపారు.వక్ఫ్ ఆస్తులను ఎలా ఉపయోగించుకోవాలో తమ పూర్వీకులు ఆలోచించారో… ఈ బిల్లు ద్వారా అలాగే ఉపయోగించడానికి వీలవుతుందని వివరించారు.
వక్ఫ్ సవరణ బిల్లుతో ముస్లింలు భయభ్రాంతులకు గురి కావొద్దని పిలుపునిచ్చారు. ఈ బిల్లుకు ముస్లిం సమాజం మద్దతివ్వాలని సూచించారు. వక్ఫ్ ఆస్తుల నిజమైన ప్రయోజనం నెరవేరాలంటే ఈ బిల్లు ఆమోదం పొందాలని, ఇది వీలైనంత వేగంగా కావాలని రజ్వీ కోరారు.





