News

చాలీసా పారాయణం పూర్తి చేసుకొని వస్తుండగా హిందువులపై రాళ్ల దాడులు

290views

బిహార్ లోని జాముయి ప్రాంతంలో హిందూ స్వాభిమాన్ కార్యకర్తలపై దుండగులు రాళ్ల దాడి చేశారు. బలియాడిహ్ గ్రామంలో హనుమాన్ చాలీసా పారాయణం పూర్తి చేసుకొని, తిరిగి వస్తుండగా.. బలియాడిహ్ మసీదు సమీపం నుంచి హిందూ స్వాభిమాన్ కార్యకర్తలపై రాళ్ల దాడి జరిగింది. ఈ రాళ్ల దాడిలో స్థానిక కౌన్సిలర్ తో పాటు మరి కొంత మంది తీవ్రంగా గాయపడ్డారు.గాయపడిన కౌన్సిలర్ నితీష్ కుమార్ ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ దాడిలో అనేక వాహనాలు కూడా ధ్వంసమైనట్లు సమాచారం.

అయితే ఈ దాడిపై హిందూ సంఘాలు స్పందించాయి. ముందస్తు ప్రణాళిక ప్రకారమే హిందువులపై రాళ్ల దాడులు జరిగాయని పేర్కొన్నారు. తమ పని తాము ముగించుకొని, చాలా శాంతంగా తిరిగి వస్తున్న సమయంలోనే దుండగులు రాళ్ల దాడికి దిగారని పేర్కొన్నారు. మరోవైపు సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితి అదుపులో వుందని పోలీసులు పేర్కొన్నారు. మరోవైపు ఈ అల్లర్ల నేపథ్యంలో స్థానికంగా ఇంటర్నెట్ సేవలను నిలిపేశారు. అయితే.. ఈ దాడితో సంబంధమున్న 8 మందిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.