
ఘాజీపూర్ ఎంపీ అఫ్జల్ అన్సారీ (సమాజ్ వాదీ పార్టీ) మహా కుంభమేళాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సంగం ఒడ్డున స్నానం చేయడం వల్ల నేరుగా వైకుంఠానికే వెళ్తామన్న నమ్మకం వుందన్నారు. అయితే.. కుంభమేళాలో రద్దీని చూస్తుంటే నరకం ఖాళీగా వుండేట్లు కనిపిస్తుందని, స్వర్గంలో మాత్రం హౌస్ ఫుల్ అయ్యేలా కనిపిస్తోందంటూ వెకిలి వ్యాఖ్యలు చేశారు.సంత్ రవిదాస్ జయంతి ఉత్సవంలో మాట్లాడుతూ ఎంపీ అన్సారీ పై వ్యాఖ్యలు చేశారు.
కుంభమేళా సందర్భంగా రైళ్ల పరిస్థితి బాగోలేదని, ప్రజలు వాటి అద్దాలు పగలగొట్టేలా పరిస్థితి తయారైందన్నారు. దీంతో రైలు లోపల కూర్చున్న మహిళలు వణికిపోతున్నారంటూ భయభ్రాంతులకు గురి చేసేలా వ్యాఖ్యనించారు. దీంతో మహిళలు తమ పిల్లలను ఒడిలో దాచుకునే పరిస్థితి వచ్చిందని, రైలు అద్దాలను కూడా పగలగొడుతున్నారని అన్నారు. దీంతో పోలీసులు కూడా తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని, తమని కూడా ప్రజలు కొడతారేమోనన్న భయంలో వున్నారంటూ నిరాధార ఆరోపణలకు దిగారు.





