
354views
భారత మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు నెల్లూరు జిల్లా, వెంకటాచలంలోని స్వర్ణభారత్ ట్రస్ట్ (Swarna Bharat Trust)లో వృత్తి విద్యా శిక్షకులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కుంభమేళాలో జరుగుతున్న తీరు ఓ ప్రపంచ చరిత్రగా అభివర్ణించారు. 45 కోట్ల మంది కుంభమేళలో పవిత్ర స్నానం చేయడం ఒక్క భారతదేశంలోనే జరుగుతుందన్నారు. విద్యార్థులు ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలని.. అలాగే తెలుగు సంస్కారం అలవార్చుకోవాలని సూచించారు. మారుతున్న తరానికి అనుగుణంగా యువతలో మార్పురావాలని వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు.





