News

రంగరాజన్ కి సంఘీభావం ప్రకటించిన సామాజిక సమరసత కార్యకర్తలు

240views

చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు రంగరాజన్ పై దాడి జరిగిన నేపథ్యంలో తెలంగాణ ప్రాంత సామాజిక సమరసత కార్యకర్తలు ఆయన్ను కలుసుకున్నారు. ఆయనకు సంఘీభావం ప్రకటించారు. రంగరాజన్ పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రకటించారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రంగరాజన్ కి సంఘీభావం తెలిపిన వారిలో సామాజిక సమరసత తెలంగాణ ప్రాంత ఉపాధ్యక్షులు సత్యనారాయణ గారు, ప్రాంత కో కన్వీనర్ వేణు గోపాల్ గారు, సంచార జాతుల రాష్ట్ర కార్యదర్శి చిరంజీవి గారు మరియు న్యాయ వాదులు శ్రీ క్రిష్ణ కన్నాన్, రాజేష్ బాబు, హర్ష వర్ధన్, శివాజీ రావు తదితరులున్నారు.

చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు సీఎస్ రంగరాజన్‌పై దాడి జరిగింది. రంగరాజన్ ఇంట్లో వున్న సమయంలో వీర రాఘవ రెడ్డి అనే వ్యక్తి 20 మందికి పైగా వ్యక్తులతో కలిసి వచ్చి దాడికి దిగాడు. ఇంట్లోకి చొరబడి మరీ… విచక్షణ రహితంగా దాడి చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలో వీర రాఘవ రెడ్డి అర్చకులు రంగరాజన్‌ని తీవ్రంగా దూషించారు. ఈ ఘటనపై అర్చకులు రంగరాజన్ మొయినాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు దాడి చేసిన వీర రాఘవరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. రంగరాజన్ నివాసానికి వీర రాఘవరెడ్డి, అనుచరులు వచ్చి రామరాజ్య స్థాపనకు మద్దతివ్వాలని కోరారు. అందుకు రంగరాజన్ తాను ఏం చేసినా రాజ్యాంగబద్ధంగానే చేస్తానని బదులిచ్చారు. దీంతో తన కుటుంబీకులను వారు తీవ్రంగా హింసించారని, తనపైనా దాడి చేశారని రంగరాజన్ ఫిర్యాదులో తెలిపారు.