News

ములుగు మన్నెంలో జాతరల సందడి

210views

ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మల మినీ జాతర బుధవారం ఉదయం ప్రారంభమైంది. వడ్డెలు సమ్మక్క-సారలమ్మ కొలువైన మేడారం, కన్నెపల్లికి ద్వారా బంధనం చేసి జాతర ప్రారంభించారు. ఈ క్రమంలో ములుగు మన్నెంలో జాతరల సందడి నెలకొంది.

తెలంగాణలోని ములుగు జిల్లా మేడారం చిన్నజాతర బుధవారం ఉదయం ప్రారంభమైంది. వడ్డెలు సమ్మక్క-సారలమ్మ కొలువైన మేడారం, కన్నెపల్లికి ద్వారా బంధనం చేసి జాతర ప్రారంభించారు. పొలిమెర దేవతలకు పూజలు నిర్వహించారు. ఈరోజు పూజారులు ఉపవాస, జాగరణ చేస్తారు. ఆదివాసీలు మేడారం, కన్నెపల్లిలోని సమ్మక్క ఆలయాలకు అలుకుపూత చేసి శుద్ది కార్యక్రమం నిర్వహించారు. వన దేవతల మినీ జాతరకు భక్తులు తరలి వస్తున్నారు. ఈ సందర్భంగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. సమ్మక్క పుట్టిన బయ్యక్కపేట, సారలమ్మ జన్మించిన కన్నెపల్లి, జంపన్న, నాగులమ్మ కొలువైన కొండాయి, పగిడిద్దరాజు కొలువైన పూనుగొండ్లలోనూ జాతరల సందడి నెలకొంది. ములుగు శివారు గట్టమ్మ ఆలయం దగ్గర భక్తుల రద్దీ నెలకొంది. భక్తులు మేడారం చిన్నజాతరకు వెళ్తూ గట్టమ్మను దర్శనం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ములుగు మన్నెంలో జాతరల సందడి నెలకొంది.

ములుగు మన్నెంలో జాతరల సందడి
ములుగు ఏజెన్సీలో జాతరల సందడి నెలకొంది. ఆదివాసీలు తమ ఇలవేల్పులను కొలుచుకొనే వేడుకలతో గూడేలు పండగ వాతావరణం సంతరించుకున్నాయి. తాడ్వాయి మండలం మేడారంలో సమ్మ క్క, సారలమ్మ చిన్నజాతర బుధవారం ఉదయం ప్రారంభమైంది. ఈ నెల 15 వరకు నాలుగు రోజులపాటు ఈ వేడుకలు కొనసాగనున్నాయి. తొలిరోజు సమ్మక్క కొలువైన మేడారంతోపాటు సారలమ్మ కొలువుదీరిన కన్నెపల్లిలోని పూజా మందిరాలను శుద్ధిచేసి అలుకుపూతలు చేశారు. గ్రామాలకు ద్వారబంధనం విధించి పొలిమేర దేవతలకు పూజలు నిర్వహించారు. రాత్రివేళ వనదేవతల గద్దెల వద్ద పూజారులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి జాగరణ చేస్తారు. వనదేవతలుగా కీర్తించబడుతున్న సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజులు, నాగులమ్మ నడయాడిన అడవి పల్లెల్లో అక్కడి గిరిజనులు అనుబంధ జాతరలను జరుపుతున్నారు. సమ్మక్కకు పుట్టినిల్లయిన తాడ్వాయి మండలం బయ్యక్కపేటలో కూడా బుధవారం నుంచే జాతర మొదలైంది.