
456views
కుంభమేళాకు మరిన్ని ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. విశాఖపట్నం–గోరఖ్‌పూర్(08588) స్పెషల్ ఈ నెల 10, 22వ తేదీల్లో రాత్రి 10.20 గంటలకు విశాఖపట్నంలో బయలుదేరుతుంది. ఈ నెల 12, 24వ తేదీల్లో రాత్రి 7.30 గంటలకు గోరఖ్‌పూర్ చేరుకుంటుంది. గోరఖ్‌పూర్–విశాఖపట్నం(08587) స్పెషల్ ఈ నెల 13, 25వ తేదీల్లో సాయంత్రం 5.45 గంటలకు బయల్దేరి 15, 27వ తేదీల్లో మధ్యాహ్నం 3.55 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ స్పెషల్ రైలు 4–సెకండ్ ఏసీ, 3–థర్డ్ ఏసీ ఎకానమీ, 8–స్లీపర్ క్లాస్, 4–జనరల్, 1–సెకండ్ క్లాస్ కం లగేజీ/దివ్యాంగ కోచ్, 1జనరేటర్ మోటర్ కార్ కోచ్‌తో నడుస్తుంది.





