News

కులశేఖరపట్టినం నుంచి మరో రెండేళ్లలో రాకెట్ ప్రయోగం

216views

తమిళనాడులోని కులశేఖరపట్టినం నుంచి మరో రెండేళ్లలో రాకెట్ను అంతరిక్షంలోకి ప్రయోగిస్తామని ఇస్రో ఛైర్మన్‌ నారాయణన్‌ తెలిపారు. ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా తన సొంత జిల్లా కన్నియాకుమరికి ఆయన విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎక్కడి నుంచి వచ్చాం, ఏ పాఠశాలలో చేరామన్నది ముఖ్యం కాదని, ఎలా చదివామన్నదే ప్రధానమని తెలిపారు. తూత్తుకుడి జిల్లా కులశేఖరపట్టినంలో ప్రయోగ కేంద్రం పనులు జరుగుతున్నాయని మరో రెండేళ్లలో అక్కడి నుంచి రాకెట్లను ప్రయోగిస్తామని పేర్కొన్నారు. అంతరిక్ష రంగంలో ప్రైవేటు సంస్థల భాగస్వామ్యం పెరిగిందని, ఇస్రోతో పాటు ఆ తరహా సంస్థల్లో ఉన్న అవకాశాలను యువత సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.