News

ధర్మబద్ధంగా నడుచుకోవాలి

65views

ప్రతి ఒక్కరూ ధర్మబద్ధంగా నడుచు కుంటే జీవితం ఆనందంగా ఉంటుందని రాజమండ్రికి చెందిన ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వి శ్వనాఽథ గోపాలకృష్ణ శాస్త్రి అన్నారు. శ్రీకాకుళం నగరంలోని బాపూజీ కళామందిర్‌లో వేదాంత శ్రవణం అనే అంశంపై ఆయన ప్రవచనం చెప్పారు. మానవులందరూ సంస్కారవంత మైన జీవితం కలిగి ఉండాలని, భార్యభర్తలు మనస్పర్థలకు తావు లేకుండా జీవించాలన్నారు. చేసిన తప్పు వల్లే భయం ఏర్పడుతుందని, ప్రతి ప్రశ్నకు పరిష్కార మార్గం ఉంటుంద న్నారు. ఈ సందర్భంగా శంకరాచార్యుల చిత్ర పటం వద్ద జ్యోతిప్రజ్వలన చేశారు. గుజరాతీ పేటలో ఉన్న లలితా పీఠం అర్చకులు పెంట రామచంద్రశేఖర్‌ శర్మ, కార్తికేయ శర్మ ఆధ్వర్యం లో జరిగిన ఈ కార్యక్రమంలో ఉపనిష్మందిరం అధ్యక్షులు గుమ్మా నగేష్‌తోపాటు ఎన్‌.న రసింహమూర్తి, జంద్యాల శరత్‌బాబు, భాస్కర్‌ భట్ల శ్రీరామశర్మ, పొట్నూరు వెంకట్రావు, పుల ఖండం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.