News

మహా కుంభమేళా పవిత్ర స్నానాలను అవమానపరిచిన కాంగ్రెస్

319views

కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హిందువులను తీవ్రంగా కించపరిచారు. హిందువుల మనోభావాలను, సంప్రదాయాలను బుజ్జగింపు రాజకీయాల కోసం అవమానపరిచారు. ప్రయాగరాజ్ వేదికగా మహా కుంభమేళా వైభవంగా జరుగుతోంది. మన దేశం వారే కాకుండా… విదేశీలయులు కూడా త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరిస్తున్నారు. ఆధ్యాత్మిక సాధనలో కూడా నిమగ్నమవుతున్నారు. సాధు సంతుల సుశ్రూషలు, సన్యాసాన్ని స్వీకరించడం కూడా జరుగుతోంది. అంతర్జాతీయ పత్రికలు కూడా మహా కుంభమేళా గురించి రాస్తున్నాయి. ఇంత వైభవోపేతంగా జరుగుతున్నా… కాంగ్రెస్ కి అవేవీ కనిపించడం లేదు. ఇప్పటి వరకు కాంగ్రెస్ అగ్రశ్రేణి పవిత్ర స్నానం ఆచరించడానికి వెళ్లనేలేదు. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ‘‘గంగలో మునిగితే పేదరికం పోతుందా?’’ అంటూ ఖర్గే హిందువులను అవమానిస్తూ వ్యాఖ్యలు చేశారు. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్” పేరుతో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశారు.

గంగానదిలో స్నానం చేస్తే పేదరికం అంతమవుతుందా? నేను ఎవరి మనోభావాలను ప్రశ్నించడం లేదు. ఎవరికైనా అభ్యంతరకరమని అనిపిస్తే క్షమాపణ చెప్పుకుంటున్నాను”అంటూ సన్నాయి నొక్కులు నొక్కారు. తాను ఒకటి అడుగుతానని, ఒక పిల్లవాడు ఆకలితో చనిపోతే, స్కూలుకు వెళ్లలేకపోతే, కూలీలకు బకాయిలు అందకపోతే, అదే సమయంలో ఈ వ్యక్తులు వేలాది రూపాయలు ఖర్చుచేస్తూ, పవిత్ర స్నానాల పేరుతో పోటీపోటీగా మునకలు (గంగానదిలో) వేయడాన్నే తాను ప్రశ్నిస్తు్న్నానని చెప్పారు. ”కెమెరాల్లో బాగా కనిపించేంత వరకూ వాళ్లు స్నానాలు చేస్తుంటారు”అంటూ అవమానించారు.

మహా కుంభమేళా కోసం ఖర్చులు చేస్తున్నారని, స్నానాలు చేయడానికి పోటీలు పడుతున్నారంటూ వ్యాఖ్యలు చేశారు. ఇతర మతస్థుల పండగల సమయంలో రాజకీయ నేతలు చేసే హంగామా మామూలుగా వుండదు. వారికిచ్చే రాయితీలకు అసలు లెక్కేలేదు. దానిని అడిగే వారే వుండరు. వారి పండగల సమయంలో వారిని అనుకరిస్తూ చేసే పనులు, వేషాలు ఎలా వుంటాయి? రంజాన్ సందర్భంగా ఇఫ్తార్ విందులకు ప్రభుత్వాలు ఎంత ఖర్చు చేస్తున్నాయి? ఆ సమయంలో రాజకీయ నేతలు చేసే చేష్ఠలేమి? వాటిపై కూడా చర్చ జరగాలి కదా అంటూ జాతీయవాదులు సూటిగా ఖర్గేపై విరుచుకుపడుతున్నారు.

కాంగ్రెస్ సనాతన ధర్మ వ్యతిరేక వైఖరి అవలంబిస్తోందని జాతీయవాదులు మండిపడుతున్నారు. దీనిపై రాహుల్ గాంధీయే నేరుగా వివరణ ఇవ్వాలని కూడా డిమాండ్లు వస్తున్నాయి. ఖర్గే గానీ, కాంగ్రెస్ గానీ సనాతన ధర్మాన్ని కించపరిచే వ్యాఖ్యలు చేయడం ఇదేమీ కొత్త కాదు. గతంలో కూడా చేశారని జాతీయవాదులు మండిపడుతున్నారు.