
225views
ఆలయాలకు వచ్చే భక్తులకు అందుతున్న సౌకర్యాలు, ఇబ్బందులు తెలుసుకునేందుకు రాష్ట్ర దేవాదాయశాఖ ‘ఆలయ దర్శనంపై సర్వే’ కార్యక్రమం చేపడుతుతోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 7 ప్రధాన ఆలయాలు అన్నవరం, సింహాచలం, ద్వారకా తిరుమల, విజయవాడ, శ్రీకాళహస్తి, కాణిపాకం, శ్రీశైలంలలో క్యూఆర్ కోడ్‌లను ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా కేటాయించిన ఈ కోడ్‌లను ప్రాంగణాల్లో పలుచోట్ల ప్రదర్శించాలని దేవాదాయశాఖ కమిషనర్ కె.రామచంద్రమోహన్ సోమవారం ఆదేశాలిచ్చారు. భక్తులు క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి దర్శన అనుభవం ఎలా ఉంది, మౌలిక వసతులు, తాగునీరు, వాష్‌రూమ్ తదితరాలపై అభిప్రాయం నమోదు చేయవచ్చు. తర్వాత పేరు, ఫోన్ నంబరు నమోదు చేసి సబ్మిట్ చేయాలి. దీంట్లో వచ్చే ఫలితాలకు అనుగుణంగా అధికారులు తదుపరి చర్యలు తీసుకోనున్నారు.





