News

భజన గీతం ఆలపించిన ఫరూక్ అబ్దుల్లా

247views

నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా ఓ భజన గీతంతో భక్తులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేశారు. గురువారం కాట్రాలోని ఓ ఆశ్రమానికి వచ్చిన ఆయన అక్కడి గాయకుడితో కలిసి మాతా షేరా వాలి భజన గీతమైన ‘తునే మురేఖ బులాయా షేరావాలియే.. ‘ అనే పాటను ఉత్సాహంగా ఆలపించారు. దీంతో అక్కడున్నవారు కరతాళ ధ్వనులతో హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.