News

కోల్‌కత్తా పుస్తక ప్రదర్శనలో వీహెచ్‌పీ స్టాల్‌కి అనుమతి నిరాకరణ.. హైకోర్టు ఆగ్రహం

296views

కోల్ కత్తా వేదికగా జరిగే 48 వ అంతర్జాతీయ పుస్తక ప్రదర్శనలో విశ్వహిందూ పరిషత్ స్టాల్ పెట్టుకోవడానికి అనుమతిని నిరాకిరించారు. పుస్తక ప్రదర్శన జరుగుతున్న ప్రతిసారీ విశ్వహిందూ పరిషత్ స్టాల్ ను ఏర్పాటు చేస్తూనే వస్తోంది. కానీ.. ఈ సారి మాత్రం నిర్వాహకులు అనుమతిని నిరాకరించారు. దీంతో వీహెచ్ పీ కలకత్తా హైకోర్టును ఆశ్రయించింది. నిర్వాహకులకు తాము దరఖాస్తు చేసుకున్నామని, ఎలాంటి స్పందనా రాలేదన్నారు. అయితే ఇప్పుడు మాత్రం తమ దరఖాస్తు సరైన ఫార్మెట్ లో లేదని, షరతులు, చట్టాలు కూడా మారాయని, అందుకే తమకు అర్హత లేదని పబ్లిషర్స్ అండ్ బుక్ సెల్లర్స్ గిల్డ్ అంటోందని కోర్టుకు తెలిపారు.

అయితే వాదనల సమయంలో గిల్డ్ తరపున న్యాయవాది వాదిస్తూ… విశ్వహిందూ ప్రచురించిన పుస్తకాలు ఉద్వేగభరితమైనవని, సున్నితమైనవని, అశాంతిని, అలజడులను రేపే పుస్తకాలంటూ నిరాధార ఆరోపణలకు దిగారు.అలాంటి వాటికి ఆస్కారం లేకుండా వుండేందుకు వీహెచ్ పీకి పుస్తక ప్రదర్శనలో చోటు కలిపించలేదని కోర్టులో వాదించారు.

ఈ వాదనపై హైకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై కలకత్దా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అమృత సిన్హా మాట్లాడుతూ… వీహెచ్‌పీ ఆ ప్రచురణలను సొంతం చేసుకున్నట్తు మీకు తెలుసా? అంటూ న్యాయవాదిని ప్రశ్నించారు. గతంలో కూడా వీహెచ్ పీకి స్టాల్స్ ఇచ్చారు కదా? అంటూ సూటిగా ప్రశ్నించారు. అకస్మాత్తుగా ఏమైంది? అంటూ నిలదీశారు. వారి ప్రచురణలు చాలా సున్నితమైనవి అన్న నిర్ధారణకు ఎలా వచ్చారన్నారు.

దీనిపై గిల్డ్ తరపు న్యాయవాది మాట్లాడుతూ.. ఈసారి పుస్తక ప్రదర్శన సందర్భంగా కొన్ని నిబంధనలు మార్చామని, అందుకే అనుమతి లేదన్నారు. దీనిపై న్యాయమూర్తి వ్యాఖ్యానిస్తూ అలాంటి చట్టపరమైన నిబంధనలు ఏవీ లేవన్నారు. మరి ఇన్ని సంవత్సరాలు ఎందుకు అనుమతినిచ్చారు. మీ ఇష్టానుసారంగా నియమ నిబంధనలు చేస్తూ వెళ్తారా? అంటూ మండిపడ్డారు.పుస్తక ప్రదర్శనలో వీహెచ్ పీ స్టాల్ ను పెట్టుకునేందుకు స్థలమివ్వాలని, ఈ కేసును జనవరి 20 న తదుపరి విచారణలో తాజా పరిస్థితి గురించి సమాచారం ఇవ్వాలని న్యాయమూర్తి ఆదేశించారు.