News

దుర్గామాత ఊరేగింపును అడ్డుకున్న క్రైస్తవులు

1kviews

శ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం రావిగుప్పు గ్రామంలో దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

దసరా నవరాత్రి ఉత్సవాలలో భాగంగా రావిగుప్పులోని హిందువులు గ్రామంలో దుర్గామాత ఊరేగింపును నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ మధ్యనే క్రైస్తవ మతాన్ని స్వీకరించిన కొందరు తమ నివాస గృహాలు ఉన్న ప్రాంతంలోకి ఊరేగింపును అనుమతించమని చెబుతూ ఊరేగింపును అడ్డుకున్నారు. అంతేకాక అదేమని ప్రశ్నించిన కొందరు హిందూ యువకులపై చేయి కూడా చేసుకున్నారు. కానీ గ్రామంలోని పెద్దలు కొందరు వారికి నచ్చజెప్పి ఊరేగింపును యదావిధిగా కొనసాగించారు.

అయితే దీనితో ఆగ్రహించిన క్రైస్తవులు కొందరు దుర్గామాత ఊరేగింపు తమ వీధిలోనికి రావటంతో తమ వీధిలో ఉన్న మేరీమాత విగ్రహం అపవిత్ర మై పోయిందంటూ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

అయితే పోలీస్ అధికారులు హిందువులు గ్రామంలో ఊరేగింపు నిర్వహించే నిమిత్తం ముందుగానే తగిన అనుమతులు పొంది ఉన్నారని వారికి తెలపడంతో పాటు మామూలు విషయాన్ని రాద్ధాంతం చేసి అనవసర మత ఘర్షణలు సృష్టించవద్దని వారిని మందలించి పంపారు.

దానితో పరిస్థితులు కొంత సద్దుమణిగిన ట్లు కనిపిస్తున్నప్పటికీ ఇరు వర్గాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. దానితో గ్రామస్తులందరూ ఏ క్షణంలో ఏం జరుగుతుందోనన్న ఆందోళనలో ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దీనిపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.