News

దుండగుల రాక్షసత్వం… ఆవు పొదుగులను కోసేసి, పరార్

182views

బెంగళూరులోని చామరాజపేటలో దుండగులు ఆవుల పొదుగులను కోసేసి, రాక్షసత్వాన్ని ప్రదర్శించారు. దీనిపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటన ఆదివారం ఉదయం జరిగింది. ఆవు పొదుగులను కోసేసిన దుండగులపై చర్యలు తీసుకోవాల్సిందేనని జాతీయవాదులు, బీజేపీ డిమాండ్ చేస్తోంది. దుండగులు చేసిన దుశ్చర్య హిందువులను, గోసంరక్షకుల మనోభావాలు ఘోరంగా దెబ్బతిన్నాయన్నారు. ఇదో క్రూరమైన దుశ్చర్య అని అన్నారు. హిందువులకు గోమాత అత్యంత పవిత్రమైందని, హిందూ ధర్మంలో గోమాతకు అగ్రస్థానం వుంటుందన్నారు. ఆవును పూజించడం అనేది హిందూ ధర్మంలో భాగమని అన్నారు. ప్రత్యేకించి సంక్రాంతి లాంటి పర్వ దినం సమయంలో ఇలాంటి ఘటనలు జరగడం ఏంటని హిందువులు అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు.

ఇలాంటి ఘటనలు జరిగిన సమయంలో దుండగులపై చర్యలు తీసుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమవుతోందని జాతీయవాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లేదంటే రాష్ట్రవ్యాప్త ఆందోళనలు నిర్వహిస్తామని బీజేపీ నేతలు హెచ్చరించారు. గోవుల రక్షణ విషయంలో కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంగా వుందని, దాని చరిత్రే అంత అని విరుచుకుపడ్డారు.

మరోవైపు శ్రీరామ సేన కూడా ఈ ఘటనపై తీవ్రంగా స్పందించింది. కొంత మంది ఈ దుర్ఘటనను ఇస్లామిక్ శక్తికి నిదర్శనంగా అభివర్ణిస్తున్నారని మండిపడ్డారు. ఆవు అనేది కేవలం జంతువు మాత్రమే కాదని, ఆహారం, ఎరువులు, ఔషదాలను కూడా అందిస్తుందని వివరించారు. అలాగే రైతులకు జీవనోపాధి విషయంలో వెన్నెముకగా నిలుస్తుందన్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత అలసత్వంతో వుందని, ముస్లిం బుజ్జగింపు రాజకీయాలు చేస్తోందన్నారు. గోహత్యకి సంబంధించిన చట్టాలు వున్నా… ఉల్లంఘనలు జరుగుతున్నాయన్నారు.నిందితులను వెంటనే గుర్తించి శిక్షించాలని డిమాండ్ చేశారు.