News

వక్ఫ్ బోర్డు ఓ మాఫియా : సీఎం యోగి మండిపాటు

217views

వక్ఫ్ బోర్డు వ్యవహారంపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ నిప్పులు చెరిగారు. చట్ట విరుద్ధంగా భూముల యాజమాన్యాన్ని అది క్లెయిమ్ చేస్తోందన్నారు. దీనిపై అస్సలు ఉపేక్షించే ప్రసక్తే లేదన్నారు. ఓ జాతీయ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో యోగి వక్ఫ్ బోర్డుపై స్పందించారు. వక్ఫ్ బోర్డు అక్రమంగా ఆక్రమించుకున్న ఏ భూమినైనా తిరిగి స్వాధీనం చేసుకోవడానికి తమ ప్రభుత్వం అస్సలు వెనకడామని తేల్చి చెప్పారు. చట్టానికి వ్యతిరేకంగా వక్ఫ్ క్లెయిమ్ చేసిన ప్రతి అంగుళాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంటామని ప్రకటించారు.

వక్ఫ్ బోర్డు అచ్చు ఓ మాఫియా లాగా వ్యవహారం చేస్తోందని దుయ్యబట్టారు. వక్ఫ్ అక్రమంగా స్వాధీనం చేసుకున్న భూమిని వాణిజ్య అవసరాలకు కూడా వినియోగించమని, రాష్ట్రంలోని అణగారిన వర్గాల సంక్షేమానికి వినియోగిస్తామని పేర్కొన్నారు. పేదలకు ఇళ్లు, ఆస్పత్రులు, విద్యాసంస్థలు నిర్మించేందుకు భూమిని వినియోగిస్తామన్నారు.అసలు వక్ఫ్ బోర్డుకి వున్న చట్టబద్ధత ఏంటని సీఎం యోగి అన్నారు. అది వక్ఫ్ బోర్డా? మాఫియా బోర్డా? అంటూ మండిపడ్డారు. ఏ భూములు చూసినా, అవి మావే అని అంటున్నారని, ఇదేం పద్ధతి అని మండిపడ్డారు.