News

కలశాకృతిలో ఒంటిమిట్ట రామాలయం కల్యాణ వేదిక

303views

ఆంధ్రుల భద్రాద్రి ఒంటిమిట్ట కోదండ రామాలయం కల్యాణ వేదిక కలశాకృతిలో ఆకట్టుకుంటోంది. వైఎస్సార్‌ జిల్లాలోని ఈ రామయ్య క్షేత్రం నుంచి ఇటీవల తీసిన డ్రోన్‌ వీడియో, చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజన తర్వాత ఇక్కడి రాములోరి సన్నిధిలో శ్రీరామనవమి వేడుకలను ప్రభుత్వం నిర్వహింస్తోంది. ఆ తర్వాత 2015 సెప్టెంబరు 9న ఆలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానంలో విలీనం చేశారు. అభివృద్ధి పనులు, భక్తులకు కావాల్సిన మౌలిక వసతుల కోసం రూ.వంద కోట్లు కేటాయించి తితిదే పనులు చేపట్టింది. కడప-రేణిగుంట జాతీయ రహదారి పక్కన విశాలమైన స్థలంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల వేళ రాములోరి కల్యాణం నిర్వహించడానికి తొలుత మండపాలను రూ.50 లక్షలతో నిర్మించింది.రూ.45 కోట్లతో కలశం ఆకృతిలో నిర్మించారు.