ఇంత చక్కటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఆంధ్రప్రదేశ్‌కు అభినందనలు.
హిందుత్వ శంఖనాదం ఎలా ఉంటుందో ఇక్కడ చూస్తే హిందువుల్లో వచ్చిన జాగృతి అర్ధమవుతుంది.
యావత్ ప్రపంచం సుఖంగా ఉండాలంటే భారతదేశం సురక్షితంగా ఉండాలి. దానికి హిందూ ధర్మం భద్రంగా ఉండాలి.
విశ్వకళ్యాణం కోసం భారతదేశం ఎప్పుడూ కృషి చేస్తూనే ఉంది.
నేను వచ్చేటప్పటికి ఇక్కడ ఛత్రపతి శివాజీ నాటకం జరుగుతోంది. మన దేశ సమస్యలన్నింటికీ పరిష్కారం శివాజీ కార్యాచరణలో ఉంది. మనం ఏ దిశలో ప్రయాణం చేయాలో శివాజీ ఆచరించి చూపించారు.
శివాజీ శూరవీరుడు మాత్రమే కాదు సాధు సత్పురుషుడు కూడా. అంతేకాదు, ఆయన గొప్ప చతురుడు కూడా. ఆయన చాతుర్యం స్వార్థం కోసం విశ్వ కళ్యాణం కోసం.
విశ్వకళ్యాణం హిందూధర్మంలో ఇమిడి ఉంది.
విశ్వానికి వెలుగు తూర్పునుంచి వచ్చింది. అది కూడా భారతదేశం నుంచి వచ్చింది, భారతదేశానికి ఆ వెలుగు ఎక్కడి నుంచి వచ్చింది.
ఆ వెలుగు ఐదు బిందువుల నుంచి వచ్చింది. అవి ఒకటి మన శాస్త్రాలు రెండు మన సాధుసంతులు, మూడవది గోమాత. నాలుగవది తీర్థక్షేత్రాలు.
ఇప్పుడు ప్రయాగలో కుంభమేళా మొదలవుతోంది. అక్కడ అన్ని రాష్ట్రాల అన్ని భాషల అన్ని సంప్రదాయాల ప్రజలూ కలిసి ఒకే మంత్రం జపిస్తారు.
హర గంగే హర గంగే. ఐదవది మందిరం. మన దేవాలయాలు కేవలం ప్రార్థనా స్థలాలు మాత్రమే కాదు. అవి భగవంతుడి నివాస స్థానాలు.
అక్కడ దైవాన్ని మనం ఆవాహన చేసి ఆ దేవతల నివాసంలో వారికి పూజాదికాలు చేస్తాం.
అందుకే వాటిని దేవాలయాలు అని పిలుస్తాము. అవే మన సంస్కృతికి ప్రేరణ కలిగిస్తాయి.
ఆ పరమాత్మ మన రక్షకుడు అన్న భావన కలిగిస్తాయి. మన మందిరాలను రక్షించాలన్న ప్రతిజ్ఞ స్వీకరించడం కోసమే మనం ఇక్కడ కలిసాం.
అయోధ్యలో మనం అద్భుతమైన రామమందిరం నిర్మించుకున్నాం. అక్కడ ఏ పనిలోనూ ప్రభుత్వాల జోక్యం లేకుండా ఒక ఆదర్శమైన పద్ధతిని ఏర్పాటు చేసుకున్నాం.
అక్కడ పునాదులు వేసినప్పటినుంచే అక్కడ ఒక ఆదర్శ పద్ధతిని ఏర్పాటు చేసుకున్నాం. ఐఐటీ ఖరగ్‌పూర్, రూర్కీ, ముంబై, చెన్నై, కర్ణావతి, భాగ్యనగరం లలోని నిపుణులతో రామమందిర నిర్మాణానికి సూచనలు తీసుకున్నాం.
అయోధ్యలో రామమందిర నిర్మాణం అత్యంత పారదర్శకంగా చేసాం. ప్రతీ పైసాకూ లెక్క చూపించాం. ఎవ్వరూ ఎలా చేయెత్తి చూపే అవకాశం ఇవ్వకుండా అక్కడ ఆలయాన్ని నిర్వహిస్తున్నాం.
అయోధ్య మందిరంలో అర్చకులు రామానంద సంప్రదాయంలో పూజాదికాలు నిర్వహిస్తారు. ఆ సముదాయంలో ఇంకా చాలా ఆలయాల నిర్మాణం జరగాలి. కాబట్టి ఎంతోమంది అర్చకుల అవసరం ఉంది. వారందరికీ రామానంద సంప్రదాయ విధానంలో శిక్షణ ఇస్తున్నాం.
మొన్న ఒక్కరోజులో అక్కడ రెండు లక్షలకు పైగా భక్తులు వచ్చారు. అందరూ ప్రశాంతంగా దర్శనం చేసుకోగలిగారు. ఎలాంటి అవరోధాలూ లేకుండా దర్శనాలు జరుగుతున్నాయి.
దివ్యాంగులకు సైతం ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయి. ప్రభుత్వాల పెత్తనం లేకుండా ఉన్నందునే అక్కడ చక్కగా దర్శనాలు,ఉత్సవాలు జరుగుతున్నాయి.
కొద్దిరోజుల్లో అయోధ్యలో మొదటి వార్షికోత్సవం జరుగుతుంది. కేవలం ప్రజల శ్రద్ధాసక్తులు, భక్తిశ్రద్ధలతో ఆ కార్యక్రమం జరగడానికి కారణం ఎవరి పెత్తనమూ లేకపోవడమే.
దేశవ్యాప్తంగా అటువంటి వాతావరణం ఉండాలి. దేవాలయాలు శ్రద్ధాకేంద్రాలుగా ఉండాలంటే వాటిపై ప్రభుత్వాల పెత్తనం ఉండకూడదు, హిందువుల తమ భక్తిశ్రద్ధలతో ఆలయాలను చక్కగా నిర్వహించుకోగలరు. జై శ్రీరాం.
బహు భారత్వం నిషేధం విషయంలో అసోం ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండా, రెండో పెళ్లి చేసుకున్న ప్రభుత్వ ఉద్యోగులకు షాక్...
లష్కరే తోయబా (LeT) ఉగ్రవాది, పాకిస్థాన్ మర్కజీ ముస్లిం లీగ్ (PMML) నాయకుడు ఇమ్రాన్ లియాకత్ భట్టి భారత్‌కు వ్యతిరేకంగా తీవ్ర బెదిరింపులకు దిగాడు. దీనికి సంబంధించిన...
మలయాళ నూతన సంవత్సరం, పవిత్ర చింగం మాసం ప్రారంభం సందర్భంగా శబరిమల శ్రీ అయ్యప్ప స్వామి ఆలయ ద్వారాలు భక్తుల దర్శనార్థం తెరుచుకున్నాయి. నెలవారీ పూజల్లో భాగంగా...
సేవాఘఢ్: బంజారా, గిరిజన సమాజం ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లేందుకు సేవాఘఢ్ నుంచి ఢిల్లీ వరకు భారత్ గోర్ బంజారా జోడో యాత్ర...
చరక జయంతి వేడుకల్లో ధన్వంతరి హవనం.. 400 మందికి పైగా ఆయుర్వేద చికిత్సలు అనకాపల్లి జిల్లా కొడూరు గ్రామంలోని ఆరోగ్యధాత్రి ఆయుర్వేద రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో విశ్వ ఆయుర్వేద...