హిందూ ధర్మానికి మూలస్తంభాలు దేవాలయీలు. వాటి స్వయం ప్రతిపత్తి కోసం ఈ కార్యక్రమానికి విహెచ్‌పి పిలుపు మేరకు వచ్చిన హిందూ బంధువులకు స్వాగతం.
దేవాలయాల రక్షణకు ఎందరో పోరాటాలు, త్యాగాలు, బలిదానాలు చేసారు. వేల సంవత్సరాలుగా మన దేవాలయాలు దాడులకు, దోపిడులకు గురవుతున్నాయి.
స్వతంత్రం వచ్చి 77 ఏళ్ళయినా పరిస్థితిలో మార్పు లేదు. దేవాలయాలను ప్రభుత్వాలు గుప్పెట్లో పెట్టుకున్నాయి. ఆలయాలను రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చాయి.
దేవాలయాలు హిందువుల చేతిలో ఉంటే నిర్వహణ ధార్మికంగా ఉంటుంది. ఇటీవల దేవాలయాలపై దాడులు జరుగుతున్న సంఘటనలు హిందువులను కలచివేస్తున్నాయి.
దేవాలయాలు హిందువుల జీవనాడి. వాటిని కాపాడుకోవాలి. దేవాలయాల్లో అన్యమతస్తులు, నాస్తికులను ఉద్యోగులుగా, ట్రస్టుబోర్డు సభ్యులుగా చేర్చకూడదు.
అలా జరగాలంటే దేవాలయాలకు స్వయంప్రతిపత్తి కావాలి.ఈ హిందూ శంఖారావ సభ భారత్‌లో దేవాలయాల విముక్తి పోరాటానికి నాంది
దేశంలో మొదటిసారి ఈ కార్యక్రమం జరుగుతోంది.
ఆలయాలకు స్వయంప్రతిపత్తి సాధించేందుకు నడుం కడదాం, దానికి పూజ్య స్వామీజీల ఆశీస్సులు ఉంటాయని ఆశిస్తున్నాం.