News

హైందవ శంఖారావానికి మంచి స్పందన

311views

ధర్మ పరిరక్షణ కోరుతూ, విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో విజయవాడలో జరుగుతున్న హైందవ శంఖారావం కార్యక్రమానికి పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నుంచి సుమారు 75 బస్సులలో హిందూ సంఘాల ప్రతినిధులు కార్యకర్తలు తరలి వెళ్లారు. హైందవ శంఖారావం ఇంచార్జి బొగిరెడ్డి అదిలక్మి ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం నుంచి జై శ్రీరామ్ నినాదాలు చేస్తూ బస్సుల్లో తరలి వెళ్ళారు.

ఈసందర్భంగా బోగిరెడ్డి ఆదిలక్ష్మి మీడియాతో మాట్లాడుతూ ఆలయాలు పరిరక్షణ కోసం విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హైందవ శంఖారావానికి హిందూ సంఘాల నుంచి మంచి స్పందన లభిస్తోందన్నారు. హిందూ సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించుకోవాల్సిన అవసరం ప్రతీ వ్యక్తి పై ఉందన్నారు. బీజేపీ ఇన్చార్జి ఈతకోట తాతాజీ మాట్లాడుతూ విశ్వహిందూ పరిషత్ ఇచ్చిన హిందూత్వాన్ని పరిరక్షణ పిలుపునకు పెద్ద ఎత్తున స్పందన వచ్చిందన్నారు. ఆలయాలను కాపాడుకోవడం, హిందూ ధర్మరక్షణకు ప్రజల్లో కదలిక వచ్చిందన్నారు.