
175views
పురాణాలకు వేదాలే ఆధారమని ఆధ్యాత్మికవేత్త సామవేదం షణ్ముఖ శర్మ తెలిపారు. ఋషిపీఠం విజయవాడ, భారతీయ సనాతన వేదిక ఆధ్వర్యంలో దుర్గాపురంలోని ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ నృత్య సంగీత కళాశాలలో మనకోసం మన పురాణాలు అంశంగా నిర్వహిస్తున్న ప్రసంగాలు ఆరో రోజుకు చేరుకున్నాయి. షణ్ముఖ శర్మ మాట్లాడుతూ ఏకాలంలోనైనా ధర్మం మారదన్నారు. ప్రకృతి శక్తుల అనుగ్రహం కోసం యజ్ఞయాగాదులు చేయాలని సూచించారు. మార్కండేయ పురాణంలో రాజుకు ఉండాల్సిన విధి విధానాలు గురించి వివరించారు. కంచి పీఠాధిపతి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి రచించిన మైత్రీం భజతాం గీతార్ధాని వివరించారు. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి విశ్రాంత కార్యనిర్వహణ అధికారి కేఎస్ రామారావు పాల్గొన్నారు.





