ArticlesNews

బాపూ మళ్ళీ రావాలి….

54views

హాత్మాగాంధీని “జాతిపిత” అని పిలవటంలో భిన్నాభిప్రాయాలు ఉండవచ్చేమోగానీ, భారతదేశంలో నివసించే సగటు భారత గ్రామీణుడు కావచ్చు లేక నిరాడంబరమైన జీవనశైలి గల ఏ ప్రపంచ పౌరుడైనా సరే వారి యొక్క భారత నాగరికత, అహింస, అంతఃశ్సుద్దికై తపన, స్వచ్ఛత, పరిశుబ్రత, నిరాడంబరత, ప్రకృతి సిద్ధమైన సహజ జీవన విధానం వంటివి వారి జీవన ముల్యాలపై  ఆయన ప్రభావం అనంతం. పర్యావరణ కాలుష్యమే కానీ, పేదరిక నిర్మూలనే గాని, ఇస్లామిక్ తీవ్రవాదమే కానీయండి ప్రపంచం ఎదుర్కుంటున్న అనేక సవాళ్లకు 150 సంవత్సరాల తరువాత కూడా గాంధీ సందేశమే సమాధానంగా ఉంది.

భారతదేశం ఏనాడూ ఆయనను కేవలం మోహన్ దాస్ కరంచంద్ గాంధీగా చూడలేదు. సగటు భారతీయునికి వారి “బాపు”కి మధ్య అంతరాలు ఎన్నడూ లేవు. ప్రతీ భారతీయునికి ఆయన కుల, మత, ప్రాంతీయ భేదాలకతీతమైన, విశ్వసనీయమైన, నమ్మదగ్గ గొప్ప ఆత్మ, మహాత్మా, మరియు గాంధీజీ. లోకమాన్య బాల గంగాధర తిలక్ తరువాతికాలంలో బ్రిటిష్ నియంతృత్వానికి వ్యతిరేకంగా గట్టిగా నిలువగలిగిన గొప్ప మార్గదర్శకునికై ఎదురు చూస్తున్న సాధారణ భారతీయులకు ఏకీకృత నాయకునిగా ఆయన నిలిచారు. తన ఆచరణ ద్వారా ఆయన నాయకత్వ శూన్యతను పూరించారు. గాంధీజీ నేర్పిన అహింస, సహాయ నిరాకరణోద్యమాలు బ్రిటిష్ పరిపాలన నుండి స్వాతంత్ర్య సముపార్జనకై సులభతరమైన ఆచరణాత్మకమైన మార్గాలుగా ప్రతీ ఒక్కరినీ ప్రేరేపించాయి.

భూమిపై ఉన్న అన్ని సౌకర్యాలను తిరస్కరించి, కోట్లాది భారతీయ సామాన్యుల వలే నివసించిన ఆయనను తాము కోల్పోయినట్లు ప్రతీ భారతీయుడు ఇప్పటికీ భావిస్తున్నాడు. కాంగ్రెస్ ను రాజకీయ సంస్థగా స్వాతంత్ర్యానంతరం కూడా కొనసాగించటాన్ని ఆయన ప్రశ్నించారు. నిజానికి ఆయన అనుసరించిన ఈ వైఖరి కారణంగా దుర్భర పరిస్థితులలో ఉన్న విభజిత భారతంలో తాను ప్రాధాన్యత ఇచ్చిన తన శిష్యులే తనతో అగౌరవంగా, అమర్యాద పూర్వకంగా వ్యవహరించినా వారి ప్రవర్తనను సైతం ఆహ్వానించారు. ఢిల్లీలోని అధికార కేంద్రానికి తనకు తానే దూరంగా ఉండి దుర్భర సామాజిక స్థితిలో, దారిద్ర్యంలో ఉన్న కోట్లాది సామాన్యుల సంక్షేమానికై ఆలోచించారు. రాజకీయ పరిధులను నిర్వచిస్తూ గాంధీజీ ఒక సంకల్ప పత్రాన్ని “లోక్ సేవక్ సంఘ్” పేరుతొ వ్రాయడం ప్రారంభించారు.

ఈ ఎల్. ఎస్. ఎస్ అనేది ఆర్. ఎస్. ఎస్ అనబడే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ను పోలి ఉంటుంది. దీని గురించి తరువాత చర్చించుకుందాం. లోక్ సేవక్ సంఘ్ అనేది స్వాతంత్ర్యాన్ని “స్వీయ అధికారం” గానూ “స్వజాతీయ భావన“ గానూ చేసే ప్రయత్నం. ఈ భావనకు సవాలు ఆయన ప్రియాతి ప్రియమైన ఏకైక వ్యక్తి శ్రీ జవహర్ లాల్ నెహ్రూ.

“ముగిసిన ప్రచార రథం”గా తాను అభివర్ణించే కాంగ్రెస్ కు ప్రతిగా లోక్ సేవక్ సంఘ్ పేరుతొ ఒక కొత్త రాజకీయ ముసాయిదా పత్రాన్ని ఆయన రచిస్తున్న సమయంలోనే దురదృష్టవశాత్తూ ఆయన హత్య గావించ బడ్డారు. బాపు హత్యానంతరం ప్రచురించబడ్డ “ఆయన చివరి శాసనం, నిబంధన” ఆయన హత్యకు ఒకరోజు ముందు లోక్ సేవక్ సంఘ్ కొరకు ఆయనచే వ్రాయబడింది. దాని ముందు మాటలో ఈ ముసాయిదా గాంధీజీచే కాంగ్రెస్ కొరకు వ్రాయబడిందని పేర్కొన్నారు. రాజకీయ స్వాతంత్రానికై ఆందోళన చెందుతున్న కాంగ్రెస్ ప్రజల సేవ కోసం (లోక్ సేవ సంఘ్ ) ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి అహింసాయుత సమాజం కోసం కృషి చేయవచ్చునని ఆయన ఉద్దేశ్యం.

లోక్ సేవక్ సంఘ్ ముసాయిదాలో గాంధీజీ ఇలా చెప్పారు. భారత జాతీయ కాంగ్రెస్ ద్వారా స్వాతంత్ర్యం సాధించిన  (రెండుగా చీలిపోయిన) భారతదేశానికి కాంగ్రెస్ ప్రస్తుత రూపం, స్థితి “ఉపయోగం లో లేని ప్రచార రధం “లా ఉంది. భారతదేశం లో పట్టణాలకు,నగరాలకు,ఆవల గల 7 లక్షల గ్రామాలు ఇంకా నైతిక, సామజిక,ఆర్ధిక స్వాతంత్ర్యం సాధించాల్సి ఉంది. మతతత్వ, రాజకీయ శక్తుల అనారోగ్యకర పోటీకి వ్యతిరేకంగా ఉంటూ నియంతృత్వ శక్తులపై ప్రజాస్వామ్య పద్దతులలో ప్రజలు దేశాభివృద్ధి సాదించాలి. ఇవేగాని ఇలాంటి మరే ఇతర కారణాల వల్ల గానీ ఒక తీర్మానం ద్వారా AICC ప్రస్తుత కాంగ్రెస్ ను రద్దుచేసి “లోక్ సేవక్ సంఘ్” గా రూపొందించాలని ఆయన భావించారు.

స్వరాజ్యమనే మధ్య కాలిక లక్ష్య సాధనకు కాంగ్రెస్ కేవలం ప్రచార రథం మాత్రమేనని గాంధీజీ భావించారు. అనేకమంది స్వాతంత్ర్య సమర యోధులు, జాతీయ భావజాలాన్ని కలిగిన ఆలోచనా పరులలానే కేవలం బ్రిటిష్ వారిని పార ద్రోలడం, స్వాతంత్ర్య సముపార్జన మాత్రమే చాలని ఆయన అనుకోలేదు. దేశంలోని పేదలు, అణగారిన వర్గాలు, అత్యంత దయనీయ పరిస్థితులలో బ్రతుకుతున్న వారి గురించి ఆయన ఆలోచించి ఇలా అన్నారు. “పట్టణాలకు,నగరాలకు వేరుగా ఉన్న 7 లక్షల గ్రామీణ ప్రాంతాలు, సాంఘిక,నైతిక,మరియు ఆర్ధిక స్వావలంబన సాధించటం ముఖ్యం.”

ప్రతీ గ్రామాన్ని ఒక యూనిట్ గా తీసుకోవటం ద్వారా జాతియాభివృద్ధికి శ్రీకారం చుట్టాలని ఆయన భావించారు. ప్రతీ పంచాయతీ నుండి 5గురు గ్రామీణ స్త్రీ లేదా పురుషులు ఒక జట్టుగా ఏర్పడాలి. లోక్ సేవక్ సంఘ్ యొక్క ప్రతీ కార్యకర్త స్వయంగా తయారు చేసిన నూలు నుండి ఖాది తయారు చేయగల ప్రవృత్తిని కలిగి వుండాలి. ప్రతీ కార్యకర్తా లక్ష్య సాధన కొరకు పని చేయాలనే భావనను ఆయన వెలిబుచ్చారు. “అతను (స్థానిక నాయకుడు) రోజు వారి పద్దులను నిర్వహిస్తూ వ్యవసాయోత్పత్తులు, చేతి వృతుల ద్వారా గ్రామాలు స్వయం సమృద్ధి సాధించేలా ప్రోత్సహించాలని ఆయన తన LSS ముసాయిదాలో పేర్కొన్నారు.

నెహ్రూ,ఆయన అత్యాశతో కూడిన కాంగ్రెస్ నాయకుల జట్టు బాపూ భావనకు అనుగుణంగా ప్రవర్తించి ఉంటే గాంధీజీ ఆలోచనల ప్రకారం గ్రామాన్నే ఒక అభివృద్ధి కేంద్రంగా స్వీకరించి కార్యకర్త ఆ గ్రామంలో సామాజిక అభివృద్ధికి, సామాజిక పరివర్తనకి దోహద పడాలి.

అల్ ఇండియా స్పిన్నర్స్ అసోసియేషన్, అల్ ఇండియా విలేజ్ ఇండస్త్రీస్, హిందూస్థాన్ టాలమి సంఘ్ (భారతీయ విలువలతో కూడిన విద్యా సంస్థ), హరిజన్ సేవక్ సంఘ్, గో సేవా సంఘ్ (గో రక్షణ, అభివృద్ధి సంస్థ)లతో LSS అనుసంధానించబడాలనే నియమం ఆయన విధించారు.

ఒకే వ్యక్తిలో ఇద్దరు గాంధీలు కనిపిస్తే  కొంత గందరగోళంగా అనిపిస్తుంది. ఒక గాంధీ – నెహ్రూ పట్ల తీవ్రమైన అభిమానం కలిగి ఉంటాడు. అదే నెహ్రూ తన తీవ్రమైన దురాశలకై ఆయనను ఒత్తిడికి గురి చేస్తాడు. ముస్లింలను బుజ్జగించ కుంటే స్వాతంత్రోద్యమం అసంపూర్తిగా వుంటుందని గాంధీజీ భావించేవారు. ముస్లింలపై భయంతో హిందువులను బలహీన పరుస్తూ ఆయన ఇచ్చిన సలహా ఏ మేరకు ఉందంటే “ఒకవేళ ముస్లింలు గనుక మనల్ని చంప దలుచుకుంటే మనం మృత్యువును ధైర్యంగా ఎదుర్కోవాలి. హిందువులను చంపిన తరువాత వారు తమ పాలనను స్థాపించ దలుచుకుంటే మనం మన జీవితాలు త్యాగం చేయటం ద్వారా కొత్త ప్రపంచానికి దారి వేద్దాం.” గాంధీజీ విప్లవకారులను అసహ్యించుకొనేవారు.  కాంగ్రెస్ అధ్యక్షడుగా ఎన్నికైన సుభాష్ చంద్రబోస్ ఆయన కారణంగా రాజీనామా చేశారు.

మరో గాంధీ స్వావలంబనతో కూడిన గ్రామీణ స్వరాజ్యంలో సామాన్యుడు నివసించే రామ రాజ్యం గురించి మాట్లాడుతారు. ఎవ్వరి పట్లా పక్షపాతం లేని ఈ గాంధీ భారతదేశానికి కావాలి. అందరికీ బాపూ అయిన ఆ బాపు కావాలి. అందరి పట్ల సమ భావన గల ఆ గాంధీ కావాలి. అహింస అనే మహాత్ముని భావన (ఆయుధం) సమాజాన్ని బలహీన పరచదు. కాంగ్రెస్  దేశ విభజనను అంగీకరించినట్లయితే, అది నా శవం పైనే జరగాలి. నేను బ్రతికి ఉన్నంతవరకు భారతదేశ విభజనను అంగీకరించను. నాకు సాధ్యమైతే కాంగ్రెస్ ను కూడా దేశ విభజనకు అంగీకరించనివ్వను.”

బాపూ మళ్ళి రండి… పునర్జన్మించండి. మీ యొక్క స్వంత భావనయైన “లోక్ సేవ సంఘ్”తో, మీ యొక్క దేశీయమైన గ్రామా స్వరాజ్య భావనతో …….

ఆంగ్ల మూలం             : Ritam

తెలుగు అనువాదం       : VSK DESK

https://m.ritam.app/Encyc/2019/10/1/Gandhi-Lok-Sevak-Sangh.amp.html

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.