News

సైన్స్ ప్రతిభాన్వేషణ పరీక్ష కౌశల్-2019 కరపత్రాలు ఆవిష్కరణ

367views

 ప్రభుత్వ పాఠశాలలలోని విద్యార్థులలో దాగివున్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఆంద్రప్రదేశ్ రాష్ట్ర సాంకేతిక మండలి మరియు భారతీయ విజ్ఞాన మండలి (VIBHA) సంయుక్తంగా నిర్వహిస్తున్న పరీక్ష కౌశల్-2019, కరపత్రాలను DRDO చైర్మన్, మరియు విజ్ఞాన భారతి జాతీయ గౌరవ సలహాదారులు శ్రీ G. సతీష్ రెడ్డి నేడు నెల్లూరులో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో 8,9,10 తరగతులు చదువుచున్న విద్యార్థులు ఈ పరీక్షలో పాల్గొనేలా  విద్యా శాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు చొరవ చూపి విద్యార్థులను ప్రోత్సహించాలని పేర్కొన్నారు.అలాగే స్వచ్ఛ భారత్, జల సంరక్షణ, ప్రకృతి వ్యవసాయం అంశాలపై పోస్టర్ ప్రజెంటేషన్ పై విద్యార్థులను ప్రోత్సాహించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కౌశల్-2019 జిల్లా సమన్వయ కర్త శ్రీ R.R.S.ప్రసాద్, రాష్ట్ర సమన్వయ కర్త శ్రీ పూడి వెంకట ప్రసాద్, విజ్ఞాన భారతి జిల్లా గౌరవాధ్యక్షులు మరియు జిల్లా ప్రధానోపాధ్యాయుల సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీ R.మురళీధర్ (HM, ZPHS, vavilla) గారు మాట్లాడుతూ జిల్లా స్థాయిలో గెలుపొందిన విజేతలకు సర్టిఫికెట్, జ్ఞాపిక, నగదు బహుమతి ప్రధమ Rs 5000/-,ద్వితీయ RS 3000/- తృతీయ Rs 2000/-పోస్టర్ ప్రజెంటేషన్ వారికి కూడా అదే విధంగా బహుమతులు అందచేయబడతయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విజ్ఞాన భారతి జిల్లా జట్టు సభ్యులు నటరాజ, ముక్కు శ్రీనివాసులు, గంగవరం శ్రీనివాసులు, శ్రీమతి రాధ, భూమన శ్రీశైల, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.